ఆగస్టు, సెప్టెంబర్‌లో మాత్రమే పూసే పూల మొక్కలు ఇవే!

Updated on: Jun 14, 2025 | 11:00 AM

జూన్, జూలై వచ్చిందంటే చాలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతుంది.అంతే కాకుండా తొలకరి చినుకులతో చాలా చల్లటి వాతావరణం అందరి మనసు దోచేస్తది. ఈ సీజన్‌లో చాలా మంది తమ ఇంటిని అందమైన పూల మొక్కలతో నింపడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వికసించే మొక్కలు ఏవి? ఏ మొక్కలు ఈ టైమ్‌లో వికసిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
 జిన్నియా, దీనిని పట్నం బంతిపువ్వులు అని కూడా పిలుస్తారు కొన్ని చోట్ల. అయితే ఈ మొక్క విత్తనాలు మార్కెట్‌లో చాలా దొరుకుతాయి. ఈ పూలు వివిధ రంగుల్లో ఉంటాయి. అంతేకాకుండా అందరినీ ఆకర్షిస్తాయి. అయితే ఈ మొక్క విత్తనాలను జూన్ చివరి వారంలో విత్తడం వలన  ఇవి ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో ఈ మొక్కపూలు వికసిస్తాయి.

2 / 5
బంతిపువ్వులు, ఈ మొక్కలు చాలా విరివిగా దొరుకుతాయి. అంతే కాకుండా ఇందులో మూడు రంగులు ఉంటాయి. వీటిని ఇంటి ఆవరణంలో పెట్టుకోవడం వలన పాములు కూడా రావు అంటారు. అంతే కాకుండా ఈ పూలు చాలా ఎక్కువ మొత్తంలో పూస్తుంటాయి. అయితే ఈ పువ్వు విత్తనాలను జూన్ చివర్లో నాటడం వలన ఈ మొక్క పూలు సెప్టెంబర్‌లో వికసిస్తాయి.

3 / 5
పోర్టులాకా, దీనిని గంటల పువ్వులు లేదా గడ్డి మొక్కలు పువ్వులు, గడ్డి గులాబీ ఇలా చాలా రకాలుగా పిలుస్తుంటారు. ఇవి పెట్టిన మరసటి రోజే పూలు పూస్తాయి. అంతే కాకుండా ఇంటిఆవరణంలో పెట్టుకోవడం లేదా బాల్కానీలో పెట్టుకోవడం వలన ఈ పూలతో ఇంటికే అందం వస్తుంది. అయితే మొక్కలను కాస్త ఎండ తగిలే చోట నాటుకోవాలి.

4 / 5
కలేన్డ్యులా ఇది చాలా అందమైన మొక్కల్లో ఒకటి. ఈ మొక్క పూలు చాలా అందంగా ఉంటాయి. అంతే కాకుండా ఇది చర్మసౌందర్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ మొక్కలో అనేక ఔషధ గుణాలు చర్మసౌందర్యాన్ని కాపాడుతాయి. అయితే వీటిని జూన్ చివరలో విత్తుకోవచ్చు. కానీ కాస్త నీడ ఉండే ప్రదేశంలో ఈ మొక్కలను పెంచుకోవడం బెస్ట్.

5 / 5
బాల్సమ్ పూలు.వీటిని గోరంట పూలు కూడా అంటారు. ఇవి వర్షాకాలంలో మాత్రమే పూస్తుంటాయి. చెట్టు నిండుగా గుంపుల గుంపులుగా ఈ పూలు పూస్తాయి. చూడనీకి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అంతే కాకుండా ఈ పూలు వివిధ రంగుల్లో వికసిస్తాయి. అయితే ఈ మొక్క విత్తనాలు విత్తేటప్పుడు కాస్త తేమగా ఉండే ప్రదేశంలో నాటడం ఉత్తమం.