సమ్మర్‌కి టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఏంజాయ్ చేయడానికి భారతదేశంలోని బెస్ట్ ప్లేసెస్ ఇవే..

Updated on: Feb 27, 2025 | 12:21 PM

సమ్మర్ వచ్చేస్తుంది. దీంతో ఇప్పటి నుంచే చాలా మంది టూర్ వెళ్లడానికి ప్లాన్ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఏప్రిల్ నెలలో భారతదేశంలో అత్యంత వేడి ఉంటుంది. దీంతో చల్లటి ప్రదేశాల్లోకి టూర్ వెళ్లడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాగా, అసలు సమ్మర్‌లో భారతదేశంలో సందర్శించడానికి చల్లగా ఉండే ప్రదేశాలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
డామన్ ఇది అద్భుతమైన బీచ్‌లకు నెలవు. ఇక్కడ చారిత్రత్మక కట్టడాలకు మారుపేరైన ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. అందులో బోమ్ జీసన్ చర్చి, మోతీ డామన్ కోట లాంటివి ప్రత్యేకం. అలాగే, సమ్మర్‌లో కూడా కూల్‌గా ఏంజాయ్ చేయాలి అనుకునే వారికి ఇక్కడి దేవ్కా, జాంపోర్ వంటి బీచ్‌లో చాలా ఆహ్లాదాన్ని, సంతోషాన్ని ఇస్తాయి. అందువలన టూర్ ప్లాన్ చేసేవారు, సమ్మర్‌లో ఇక్కడికి వెళ్లి చాలా ఎంజాయ్ చేయవచ్చు.

2 / 5
సమ్మర్ టూర్ ప్లాన్ చేసే వారికి అద్భుతమైన ప్రదేశాల్లో దిఘా బీచ్ ఒకటి. పశ్చిమ బెంగాల్ లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో ఇది ఉంది. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఇదొకటి. ఇక్కడి బీచ్ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఏప్రిల్ నెలలో ఇక్కడ సగటు ఉష్ణోగ్రత గరిష్టంగా 34 సెల్సియస్ నుంచి కనిష్టంగా26 సెల్సియస్ ఉంటుంది.విశ్రాంతికి ఇది బెస్ట ప్లేస్, ఇక్కడి తెల్లని ఇసుక, స్వచ్ఛమైన నీలి రంగు నీరు, పర్యాటకులను ఆకర్షిస్తాయి.

3 / 5
హిమాచల్ ప్రదేశ్‌లోని సుందరమైన కొండలలో కసౌలి ఒకటి. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఏప్రిల్ నెలలో కసౌలిలో ఆహ్లాదకరమైన ఉష్ణోగ్రతలు, పచ్చని ప్రకృతి దృశ్యాలు మనసుకు చాలా హాయినిస్తాయి. దాదాపు 13 గంటల పగటి వెలుతురుతో ఉండే ఈ ప్రదేశంలో పర్యాటకులు మంచి వాతావరణం, చల్లటి గాలులతో మీ హాలిడేస్ చాలా ఎంజాయ్ చేయొచ్చు.

4 / 5
 చిరపుంజీగా పిలువబడే మేఘాలయలోని సోహ్రా ఆహ్లాదానికి నిలయం. ఇది ఎన్నో కథలను తనలోనే దాచుకుంటుంది. నదులు, జలపాతాలు, పొగమంచుతో కప్పబడిన కొండలపైనే ఆకాశం ఉందా అనేలే కనిపించే ఈ ప్రదేశం సెలవులలో ఏంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్.

5 / 5
అలాగే, అండమాన్ నికోబార్ దీవులు కూడా మీరు సమ్మర్‌లో ఏంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్. ఇక్కడి బీచ్‌లు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి.