
పాత కాలంలో ఇది తిన్నారు కాబట్టే 60 లలో కూడా మన తాతలు ఉక్కులా పని చేస్తున్నారు అది మరేదో కాదు మినపప్పు పాయసం. ఇది తినడం వలన బాడీకి ఎన్నో లాభాలున్నాయి. అలాగే, ఇది తినడానికి తియ్యగా, కమ్మగా ఉంటుంది. దీనిని మినపప్పు, బెల్లం, పాలతో చేస్తారు. ఇది ఎముకల నొప్పులను తగ్గిస్తుంది దీనికి అంత పవర్ ఉంది.

మినపప్పు పాయసం రెసిపీకి కావాల్సిన కావలసిన పదార్థాలు: ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు బెల్లం తురుము, రెండు కప్పుల పాలు, రెండు కప్పుల నీళ్లు, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 10 జీడి పప్పులు, 10 కిస్మిస్ లు, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిను తీసుకోవాలి అలాగే దీనిని సరైన కొలతలతో చేస్తే ఈ తీపి వంటకం టేస్ట్ అదిరిపోతోంది.

ముందుగా మినపప్పును రెడీ చేసుకోవాలి: ముందుగా ఒక చిన్న పాత్ర తీసుకుని మినపప్పును దానిలో వేసి ఒకటికి మూడు సార్లు కడగాలి. ఆ తర్వాత ఉడకబెట్టి ఒక చిన్న ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇంకో పాత్ర పెట్టి దానిలో కొద్దిగా పాలు పోసి వాటిని బాగా మరిగించాలి. ఆ తర్వాత బెల్లం ముక్కలు కూడా దీనిలో వేసుకోవాలి. ఇలా చేస్తే అబ్బబ్బా టేస్ట్ అదిరింది అంటారు

బాదం పప్పు, కిస్ మిస్ లను ఇలా వేయించుకోవాలి: చిన్న పాన్ తీసుకుని గ్యాస్ పొయ్యి మీద పెట్టి దానిలో నెయ్యి వేసి బాదం పప్పులు , కిస్మిస్ లు కూడా వేయించి గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇంకా బెల్లం పాలలో కరిగిపోయే వరకు సన్నని మంట మీద బాగా ఉడికించుకోవాలి. ఇలా చేసి తింటే తియ్య తియ్యగా ఉంటుంది.

చివర్లో వీటిని కలపాలి : చివర్లో వేయించిన బాదం పప్పులు , జీడిపప్పు, యాలకుల పొడిని వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి కిందకు చేసి తినడమే. అంతే, వేడి వేడి మినపప్పు పాయసం రెడీ. ఇలా చేసి పిల్లలకు పెడితే ఎంతో ఇష్టంగా తింటార దీనిని వేడిగా తినొచ్చు .. ఇంకా చల్లగా తినొచ్చు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి తినండి.