Xiaomi Smart TV 5A Pro: తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్‌ టీవీ కోసం చూస్తున్నారా.? ఈ కొత్త షావోమీ టీవీ మీకోసమే..

|

Aug 17, 2022 | 1:13 PM

Xiaomi Smart TV 5A Pro: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం షావోమీ తాజాగా కొత్త స్మార్ట్‌ టీవీని లాంచ్‌ చేస్తోంది. షావోమీ స్మార్ట్‌ టీవీ 5ఏ ప్రో పేరుతో లాంచ్‌ చేయనున్న ఈ టీవీని బడ్జెట్‌ ధరలో అందుబాటులోకి తీసుకురానున్నారు..

1 / 5
ప్రస్తుతం స్మార్ట్‌ టీవీల హవా నడుస్తోంది. రోజుకో కొత్త స్మార్ట్ టీవీ మార్కెట్లో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే కంపెనీల మధ్య పెరిగిన పోటీ కారణంగా టీవీల ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఇలా తాజాగా బడ్జెట్‌ ధరలోకి మరో స్మార్ట్‌ టీవీ అందుబాటులోకి వచ్చింది. షావోమీ స్మార్ట్‌ టీవీ 5ఏ ప్రో పేరుతో తీసుకొచ్చిన ఈ టీవీ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

2 / 5
ఈ 32 ఇంచుల స్మార్ట్‌ టీవీ ధర రూ. 16,999గా ఉంది. త్వరలోనే సేల్‌ ప్రారంభంకానున్న ఈ టీవీ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఎంఐ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు స్టోర్స్‌లోనూ అందుబాటులోకి రానుంది.

3 / 5
ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో హెచ్‌డీ రెడీ రెజల్యూషన్‌తో కూడిన 32 ఇంచెస్‌ స్క్రీన్‌ను అందించారు. పిక్చర్‌ క్వాలిటీ కోసం వివిధ్‌ పిక్చర్‌ ఇంజన్‌ ప్రాసెసింగ్ టెక్నాలజీని అందించారు. డీటీఎస్‌-ఎక్సల్‌ డాల్బీ ఆడియోకు సపోర్ట్‌ చేసే స్పీకర్లు ఈ టీవీ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

4 / 5
ఆండ్రాయిడ్‌ టీవీ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ టీవీ గూగుల్‌ అసిస్టెంట్‌, క్రోమ్‌కాస్ట్‌కు సపోర్ట్‌ చేస్తుంది. గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి యాప్స్‌, గేమ్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

5 / 5
1.5 జీబీ ర్యామ్‌, 8 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో కూడిన ఈ స్మార్ట్ టీవలో రెండు హెచ్‌డీఎమ్‌ఐ పోర్ట్‌లు, రెండు యూఎస్‌బీ పోర్ట్‌లు ఇచ్చారు. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వైర్‌లెస్‌ కనెక్టివిటీ ఫీచర్ల ఈ టీవీ సొంతం.