కొత్త బైక్‌ కొనాలనుకుంటున్నారా? ఆఫీస్‌కు వెళ్లే వారికి సూటైయ్యే టాప్‌ 5 బైకులు ఇవే!

Updated on: Apr 15, 2026 | 6:12 PM

భారత మార్కెట్లో కొత్త బైక్‌ల వెల్లువ మధ్య, నమ్మకమైన పనితీరు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులతో రోజువారీ ప్రయాణాలకు అనువైన బైక్‌ను ఎంచుకోవడం గందరగోళంగా మారింది. ఈ ఆర్టికల్, ఆఫీసు లేదా వ్యాపార అవసరాల కోసం అత్యంత అనుకూలమైన, తక్కువ ఖర్చుతో నడిచే టాప్ 5 బైక్‌లను పరిచయం చేస్తుంది.

1 / 5
ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ప్రతిరోజూ కొత్త బైక్‌ మోడళ్లు విడుదలవుతుండటంతో వినియోగదారులు ఏది ఎంచుకోవాలన్న దానిపై అయోమయానికి గురవుతున్నారు. ఎక్కువగా లుక్స్, స్పీడ్, ఫీచర్లకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, రోజువారీ ప్రయాణాలకు ముఖ్యమైనది నమ్మకమైన పనితీరు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు. ఈ నేపథ్యంలో రోజూ ఆఫీసు లేదా వ్యాపార అవసరాల కోసం ఉపయోగించడానికి అనువైన, తక్కువ ఖర్చుతో నడిచే టాప్-5 బైకుల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. మొదటగా Yamaha MT-15 V2 యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ బైక్ స్టైలిష్ లుక్‌తో పాటు శక్తివంతమైన 155cc ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ట్రాఫిక్‌లో కూడా సులభంగా నడపగలిగే ఈ బైక్, హై పెర్ఫార్మెన్స్‌తో పాటు మంచి రిలయబిలిటీని అందిస్తుంది.

2 / 5
రెండవది TVS Apache RTR 160 4V స్మూత్ రైడింగ్ అనుభవం, రైడింగ్ మోడ్స్ వంటి ఫీచర్లు ఈ బైక్‌ను ప్రత్యేకంగా నిలబెడతాయి. రోజువారీ ప్రయాణాల్లో అలసట లేకుండా సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. టీవీఎస్ సర్వీస్ నెట్‌వర్క్ బలంగా ఉండటం కూడా ఒక పెద్ద ప్లస్.

3 / 5
మూడవది Hero Splendor Plus దశాబ్దాలుగా భారతీయుల విశ్వాసాన్ని గెలుచుకున్న ఈ బైక్, మైలేజీ, తక్కువ మెయింటెనెన్స్‌లో అగ్రగామిగా నిలుస్తోంది. సాధారణ వినియోగదారులకు ఇది అత్యంత నమ్మకమైన ఎంపికగా కొనసాగుతోంది.

4 / 5
నాలుగవది Bajaj Pulsar 125 పల్సర్ బ్రాండ్‌కు చెందిన ఈ మోడల్, స్టైలిష్ లుక్‌తో పాటు తక్కువ ఖర్చుతో నిర్వహించగలిగే బైక్‌గా గుర్తింపు పొందింది. పట్టణాల్లో రోజువారీ వినియోగానికి ఇది సరైన ఎంపిక.

5 / 5
చివరిగా Honda H'ness CB 350 క్లాసిక్ లుక్, స్మూత్ ఇంజిన్ పనితీరు ఈ బైక్ ప్రత్యేకత. 350cc సెగ్మెంట్లో ఉన్నప్పటికీ మెయింటెనెన్స్ తక్కువగా ఉండటం, లాంగ్ రైడ్స్‌కు అనువుగా ఉండటం దీని ప్రధాన ఆకర్షణ.

Follow Us