Phone Hack: మీ ఫోన్‌ హ్యాక్‌ అయిందని డౌట్‌గా ఉందా.? ఇలా తెలుసుకోండి..

|

Nov 10, 2023 | 9:21 PM

ప్రస్తుతం సైబర్‌ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మరీ ఎక్కువయ్యాయి. ఫోన్‌లను హ్యాక్‌ చేస్తూ సైబర్ నేరగాల్లు విలువైన డేటాను దోచేస్తున్నారు. స్మార్ట్ ఫోన్‌ హ్యాకింగ్ బారినపడి డబ్బు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. అయితే మన స్మార్ట్ ఫోన్‌ హ్యాకింగ్‌కు గురైన విషయాన్ని కొన్ని సింపుల్‌ చిట్కాల ద్వారా తెలుసుకోవచ్చు. ఇంతకీ ఫోన్‌ హ్యాక్‌ అయినట్లు తెలిపే కొన్ని లక్షణాలపై ఓ లుక్కేయండి..

1 / 5
డేటా అసహజంగా పూర్తయితే ఫోన్‌ హ్యాక్‌కి గురైందని అర్థం చేసుకోవాలి. హ్యాకర్లు మరో చోటు నుంచి ఫోన్‌ను ఆపరేట్ చేస్తుంటారు కాబట్టి డేటా త్వరగా పూర్తవుతుంది. ఒకవేళ ఫోన్‌లో డేటా ఇలా వేగంగా తగ్గిపోతుంటే మీ ఫోన్‌ హ్యాక్‌ గురైనట్లు అర్థం చేసుకోవాలి.

2 / 5
 ఒకవేళ స్మార్ట్ ఫోన్ హ్యాక్‌కి గురైతే బ్యాటరీ త్వరగా తగ్గిపోతుంది. ఫోన్‌ను ఆపరేట్‌ చేయకున్నా బ్యాటరీ దానంతటదే తగ్గిపోతున్నా వెంటనే అలర్ట్ అవ్వాలి. ఇలా జరిగితే మీ ఫోన్‌లో మాల్వేర్‌ లేదా స్పైవేర్‌ ఎంటర్‌ అయిందని అర్థం చేసుకోవాలి.

3 / 5
ఇక మీ స్మార్ట్ ఫోన్‌లో సెక్యూరిటీ ఫీచర్స్‌ ఏవైనా వాటంతటవే ఆఫ్‌ అయితే కూడా ఫోన్‌ హ్యాకింగ్‌కు గురైనట్లు అర్థం చేసుకోవాలి. ఫోన్‌లోని సెక్యూరిటీ ఫీచర్స్‌ను ఆఫ్‌ చేయడం ద్వారా హ్యాకర్లు మీ ఫోన్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటారు.

4 / 5
స్మార్ట్‌ ఫోన్‌ అసాధారణంగా వేడెక్కుతోన్నా ఫోన్ హ్యాక్‌కి గురైనట్లు అర్థం చేసుకోవాలి. ఫోన్‌ను మనం ఆపరేట్‌ చేయకపోతున్నా వేడెక్కుతోందంటే దాని అర్థం.. బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్‌ రన్‌ అవుతున్నట్లు అర్థం చేసుకోవాలి.

5 / 5
ఒకవేళ మీ స్మార్ట్ ఫోన్‌లో మీరు డౌన్‌లోడ్ చేయని యాప్స్‌ ఏవైనా తరచుగా పాప్‌ అప్‌ అవుతుంటే మీ ఫోన్‌ హ్యాక్‌కి గురైనట్లు అర్థం చేసుకోవచ్చు. ఇలా పాప్‌ అప్‌లను క్లిక్‌ చేయించి మీ ఫోన్‌ను హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకుంటారు.