Upcoming Smartphones: ఎదురుచూపులకు ఫుల్ స్టాప్.. మార్చిలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న టాప్ స్మార్ట్ ఫోన్లు ఇవే..

|

Feb 21, 2024 | 7:22 AM

మన దేశంలో స్మార్ట్ ఫోన్లకు మంచి డిమాండే ఉంది. ఎప్పుడు ఏ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అయినా వాటిపై అమితాసక్తి ఉంటుంది. అలాగే లాంచ్ కానున్న ఫోన్ల కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ క్రమంలో కొన్ని టాప్ బ్రాండ్ ఫోన్లు వచ్చే నెల అంటే మార్చిలో మార్కెట్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. వాటిల్లో నథింగ్ ఫోన్ 2ఎ, శామ్సంగ్ గెలాక్సీ ఏ55 5జీ, జియోమీ 14, రియల్ మీ 12 ప్లస్ 5జీ, వివో వీ3 ప్రో వంటి మోడళ్లు ఉన్నాయి. ఈ పోన్లలోని ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
శామ్సంగ్ గెలాక్సీ ఏ55 5జీ.. ఇది మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.5-అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా మాడ్యూల్ ఉండే అవకాశం ఉంది. శామ్సంగ్ ఇన్ బిల్ట్ ఎక్సినోస్ 1480 ఎస్ఓసీ ఆధారంగా పనిచేస్తుంది.

2 / 5
నథింగ్ ఫోన్ 2ఏ.. ఇది మార్చి 5వ తేదీన మార్కెట్లోకి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్లో 6.7-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, డ్యూయల్-కెమెరా మాడ్యూల్, 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. అలాగే మీడియా టెక్ డైమెన్సిటీ 7200 ఎస్ఓసీలో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. నథింగ్ కంపెనీ నుంచి వస్తున్న చవకైన ఫోన్ ఇదే అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

3 / 5
వివో వీ30 ప్రో.. స్టాండర్డ్ వివో వీ30 విడుదల తర్వాత, ఫోన్ ప్రో వేరియంట్ ఫిబ్రవరి 28న మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు. టిప్‌స్టర్‌ల ప్రకారం, ఈ ఫోన్ కర్వ్ డ్ 3డీ డిస్‌ప్లే తో వస్తుంది. ట్రిపుల్ కెమెరా మాడ్యూల్‌తో ప్రాథమిక 50-మెగాపిక్సెల్ సెన్సార్‌తో ఉంటుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్‌తో నడుస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుందని చెబుతున్నారు.

4 / 5
జియోమీ 14.. జియోమీ 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు మార్చి 7న దేశంలో విడుదల కానున్నాయి. ఈ వేరియంట్లు120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.36-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. ఇది క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్ఓసీ ఆధారంగా నడుస్తుంది. ప్రైమరీ కెమెరా 50-మెగాపిక్సెల్ లెన్స్ ఉంటుంది. అలాగే 50-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్, మరో 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది.

5 / 5
రియల్ మీ 12+ 5జీ.. ఇటీవల లాంచ్ రియల్ మీ 12 ప్రో 5జీ, రియల్ మీ 12 ప్రో ప్లస్ 5జీ తర్వాత మిడ్ రేంజ్ లో రియల్ మీ 12 ప్లస్ ని తీసుకొచ్చేందుకు కంపెనీ ప్రణాళిక చేస్తోంది. అయితే దీని గురించి ఇంకా అధికారిక సమచారం ఏమి తెలియలేదు. ఎక్స్(ట్విట్టర్)లో ఈ ఫోన్ కు సంబంధించిన టీజర్ మాత్రం రిలీజ్ చేసింది. దీనిని బట్టి వచ్చే నెలలోనే ఇది కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.