Best Phones Under 25K: అత్యత్తమ ఫీచర్లు.. అతి తక్కువ ధర.. కొంటే ఈ ఫోన్లనే కొనాలి..

|

Jun 19, 2024 | 12:22 PM

సరికొత్త ఫీచర్లతో రోజుకో ప్రముఖ బ్రాండ్ ఫోన్ మార్కెట్ లోకి విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రజలకు ఏ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలో తెలియడం లేదు. విడుదలవుతున్న ఫోన్లలో ఒకదానికి ఎంపిక చేసుకోవడం చాలా కష్టంగా మారుతోంది. అనేక ప్రముఖ బ్రాండ్ల ఫోన్లు మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. స్మార్ట్ ఫోన్ల కోనుగోలు చేసినప్పుడు ధరను పరిశీలించడం చాలా ముఖ్యం. దేశంలో చాలామంది సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే. వారికి ధర ఆర్థిక భారం కాకుండా ఉండాలి. ఈ నేపథ్యంలో రూ.25 వేల ధరలో అత్యుత్తమ ఫీచర్లతో అందుబాటులో ఉన్న ప్రముఖ ఫోన్ల గురించి తెలుసుకుందాం.

1 / 5
రియల్ మీ 12 ప్రో.. రియల్ మీ 12 ప్రో స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో అందుబాటులో ఉంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ వన్ చిప్‌సెట్ తో పనిచేస్తుంది. 6.7అంగుళాల కర్వ్డ్ డిస్‌ప్లేతో విజువల్ స్పష్టంగా ఉంటుంది. దీనిలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఆకట్టుకుంటోంది. 67 డబ్ల్యూ సూపర్వూక్ చార్జర్ ను ఉపయోగించి దీనిలోని 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కేవలం 28 నిమిషాలలోనే చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ ధర 22,999.

2 / 5
నథింగ్ ఫోన్ (2ఎ).. నథింగ్ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 స్టోరేజీ సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చింది. దీనిలో అమెలెడ్ ప్యానెల్, డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్, రెండు హెచ్ డీ మైక్రోఫోన్లు, గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌లో మూడు ఎల్ఈడీ స్ట్రిప్పులు ఉన్నాయి. దీనిలో 50 ఎంపీ+ 50 ఎంపీ కెమెరా సెటప్‌ ఏర్పాటు చేశారు. ముందు భాగంలో సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32 ఎంపీ సెన్సార్ ఉంది. మీడియా టెక్ డైమన్సిటీ 7200 ప్రో చిప్‌సెట్ ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది. దీని ధర రూ.23,999.

3 / 5
పోకో ఎక్స్ 6 ప్రో.. సరికొత్త పోకో స్మార్ట్ ఫోన్ లో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే ఉంది. మీడియా టెక్ డైమన్సిటీ 8300 ఆల్ట్రా తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్‌ల కోసం మాలి జీపీయూను జత చేశారు. ఎక్స్ 6 ప్రో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపీ మాక్రో లెన్స్‌కు మద్దతుతో 64 ఎంపీ ప్రైమరీ కెమెరా ఏర్పాటు చేశారు. సెల్ఫీ, వీడియోల కోసం 16 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ సెన్సార్ ఉంది. దీనిలోని 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని 67 డబ్ల్యూ ఛార్జర్ తో వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. ఐపీ 54 రేటింగ్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఆర్ బ్లాస్టర్‌ అదనపు ప్రత్యేకతలు.

4 / 5
ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో.. 6.78 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ, మీడియా టక్ డైమన్సిటీ 8200 అల్టిమేట్ చిప్‌సెట్ దీని ప్రత్యేకతలు. గ్రాఫిక్స్ఇంటెన్సివ్ టాస్క్‌ల కోెసం మాలి జీ610- ఎంసీ6 చిప్‌సెట్‌తో జత చేశారు. దీనిలో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని 45 డబ్ల్యూ అడాప్టర్ తో వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. ఇన్ఫినిక్స్ సొంత ఎక్స్ వోఎస్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది.. ఈ ఫోన్ లో రెండేళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, మరో ఏడాది సెక్యూరిటీ ప్యాచ్‌లకు వారంటీ ఉంది. ఈ ఫోన్ ధర 24,999.

5 / 5
వన్ ప్లస్ నోర్డ్ సీఈ4..ఈ ఫోన్ లో 6.7 అంగుళాల హెడ్ అమోలెడ్ డిస్ ప్లే ఉంది. 8 జీబీ ర్యామ్, 125 జీబీ స్టోరేజ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్వోసీ, గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్‌ల కోసం అండ్రేనో 720 జీపీయూ ఏర్పాటు చేశారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (వోఐఎస్), 8 ఎంపీ సోనీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో 50 ఎంపీ సోనీ ఎల్వైటీ 600 ప్రైమరీ, డ్యూయల్ రియర్ కెమెరా సెన్సార్‌ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్‌ను అమర్చారు. ఈ ఫోన్ 24,999కు అందుబాటులో ఉంది.