Best Smartwatches under 1500: వావ్ అనే ఫీచర్లతో స్మార్ట్ వాచ్‌లు కేవలం రూ. 1,500లోపు ధరలోనే.. మిస్ చేసుకోవద్దు..

| Edited By: Ravi Kiran

Oct 04, 2023 | 11:00 AM

స్మార్ట్‌ ఫోన్‌ వచ్చాక మనిషి సౌలభ్యం పెరిగింది. ఏది కావాలన్నా ఒక్క స్మార్ట్‌ ఫోనే సమాధానం చెబుతుంది. అయితే బిజి షెడ్యూల్స్‌లో, ప్రయాణాల్లో ఆ ఫోన్‌ చూడటం కూడా కష్టమవుతూ ఉంటుంది. అయితే స్మార్ట్‌ వాచ్‌ వచ్చాక ఆ కష్టం కూడా లేకుండా పోయింది. అస్తమాను ఫోన్‌ జేబులో నుంచి తీయాల్సిన అవసరం లేకుండానే మణికట్టుతోనే అన్ని అప్‌డేట్లు, ఫోన్‌ కాల్స్‌, నోటిఫికేషన్లు తీసుకొనే వెసులుబాటు దొరికింది. అందుకే అందరూ ఈ స్మార్ట్‌ వాచ్‌లను కావాలనుకుంటున్నారు. పైగా దీనిలో ఉండే ఫీచర్లు, హెల్త్‌ ట్రాకర్లు చాలా ప్రయోజనకరంగా ఉంటున్నాయి. మీరు కూడా ఇలాంటి స్మార్ట్‌ వాచ్‌ కావాలనుకుంటున్నారా? కానీ అనువైన బెడ్జె‍ట్లో రావాలనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. అతి తక్కువ ధరలో.. కేవలం రూ. 1,500లోపు బడ్జెట్లో టాప్‌ బ్రాండ్లను నుంచి అందుబాటులో ఉన్న స్మార్ట్‌ వాచ్‌లపై ఓ లుక్కేద్దాం రండి..

1 / 5
బీట్‌ఎక్స్‌పి మార్వ్ ఆరా 1.83.. దీనిలో 1.83 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో పాటు ఆరోగ్య ట్రాకింగ్‌లను కలిగి ఉంటుంది. ఇది ఫిట్‌నెస్ ఔత్సాహికులకు ఉత్తమమైనది. ఆల్‌వేస్‌ ఆన్‌ డిస్‌ ప్లే ఫీచర్‌ ఉంటుంది. 60హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో స్క్రీన్‌ ఉంటుంది. వాచ్ నీటి నిరోధకతను కలిగి ఉంటుంది 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లతో పాటు ఏఐ వాయిస్‌ అసిస్టెంట్‌ కమాండ్‌ ఉంటుంది. అనేక రకాల హెల్త్‌ ట్రాకర్లు ఉంటాయి. దీని ధర అమెజాన్‌లో రూ. 1,099గా ఉంది.

2 / 5
బోట్ వేవ్ సిగ్మా స్మార్ట్‌వాచ్‌.. బ్లూ టూత్‌ కాలింగ్‌ ఫీచర్‌తో అతి తక్కువ ధరలో లభిస్తున్న స్మార్ట్‌ వాచ్‌ ఇది. దీనిలో ప్రీమియం అంతర్నిర్మిత స్పీకర్, మైక్రోఫోన్‌ ఉంటుంది. ఇది చాటింగ్‌ కూడా బాగా ఉపకరిస్తుంది. మీ అభిరుచికి అనుగుణంగా వాచ్‌ ఫేసెస్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. 5 రోజుల బ్యాటరీ లైఫ్‌ ఉంటుంది. స్లీప్‌ సైకిల్‌, హార్ట్‌ రేట్‌, ఆక్సిజన్‌ స్థాయిలను ట్రాక్‌ చేయొచ్చు. దీనిలో రెండు అంగుళాల పెద్ద స్క్రీన్‌ ఉంటుంది. ఈ బోట్ స్మార్ట్‌వాచ్ ధర అమెజాన్‌లో రూ. 1,499గా ఉంది.

3 / 5
ఫైర్-బోల్ట్ నింజా 3 ప్లస్.. రూ. 1,500లోపు ధరలో ఉత్తమ స్మార్ట్‌ వాచ్‌ కావాలనుకుంటే ఇది మంచి ఆప్షన్‌. ఇందులో అన్ని తాజా ఆరోగ్య ట్రాకర్లను పొందవచ్చు. 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు అందుబాటులో ఉంటాయి. 100కి పైగా క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేస్‌లు. మీరు ఎంచుకోగల విస్తృత శ్రేణి రంగులు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ వాచ్‌లో 1.83 అంగుళాల పెద్ద స్క్రీన్ ఉంటుంది. మీ గుండె ఆరోగ్యాన్ని స్పష్టంగా తనిఖీ చేయవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ దుమ్ము,, వర్షపు చినుకులను తట్టుకునేలా ఐపీ 68 వాటర్‌ రెసిస్టెన్స్‌ ఉంటుంది. ఈఫైర్-బోల్ట్ స్మార్ట్‌వాచ్ ధర ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ ఫారం అమెజాన్‌లో రూ. 999కే కొనుగోలు చేయొచ్చు. అయితే దీనిలో బ్లూటూత్‌ కాలింగ్‌ సదుపాయం లేదు.

4 / 5
నాయిస్ పల్స్ 2 మ్యాక్స్‌.. ఇది వాచ్‌ పిక్చర్‌ క్వాలిటీ బాగుంటుంది. స్పష్టత, ప్రకాశత ఉంటుంది. దీనిని మీ సెల్‌ ఫోన్‌కి కనెక్ట్‌ చేయొచ్చు. సెల్‌ ఫోన్‌ తీయకుండానే మెసేజ్‌, కాల్స్‌ మాట్లాడొచ్చు. ఇది స్మార్ట్‌ డీఎన్‌డీ ఫీచర్‌తో వస్తుంది. 10 రోజుల లైఫ్‌ ఇ‍చ్చే బ్యాటరీ ఉంటుంది. 150కి పైగా క్లౌడ్‌ ఆధారిత వాచ్‌ ఫేసెస్‌ అందుబాటులో ఉంటాయి. దీని ధర అమెజాన్‌లో రూ. 1,299గా ఉంది.

5 / 5
పీట్రాన్‌ రిఫ్లెక్ట్ కాల్జ్ స్మార్ట్‌వాచ్.. ఇది ఇటీవలే లాంచ్‌ అయిన కొత్త స్మార్ట్‌ వాచ్‌. టచ్‌ స్క్రీన్‌ మీకు ఉపయుక్తంగా ఉంటుంది. మెటల్ స్ట్రాప్‌తో పాటు 2.5డీ కర్వ్‌డ్‌ డిస్‌ప్లే గ్లాస్‌తో ధరించినప్పుడు స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఈ వాచ్‌లో రియల్ టైమ్ హార్ట్ రేట్ చెక్, రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలు, బ్లడ్ ప్రెజర్ చెక్, స్లీప్ మానిటర్, సెడెంటరీ అలర్ట్, స్టెప్ కౌంట్, వంటి అనేక ఆరోగ్య, ఫిట్‌నెస్ ట్రాకర్లు ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ రెండింటికీ సపోర్టు చేస్తుంది. ఐపీ68 రేటింగ్‌తో వాటర్‌ రెసిస్టెంట్‌తో వస్తుంది. దీని ధర అమెజాన్‌లో రూ. 999గా ఉంది.