లెనోవా ట్యాబ్ ఎం7.. ఇది తక్కువు ధరలో లభించే బెస్ట్ ట్యాబ్లెట్లలో ఒకటి. ఇది 90శాతం వరకూ పూర్తి మెటల్ బ్యాక్ కవర్ తో వస్తుంది. అందువల్ల చేతిలో మంచి గ్రిప్ ఇస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేస్తుంది. వేగవంతమైన బ్రౌజింగ్ తో పాటు గేమింగ్ కోసం బెస్ట్ ఎంపిక. 32జీబీ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. హెచ్ డీ డిస్ ప్లే ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ పై ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో 19శాతం తగ్గింపు ఉంది. దీని ధర కేవలం రూ. 7,996.
శామ్‌సంగ్ గేలాక్సీ ట్యాబ్ ఏ7 లైట్.. దీనిలో బెస్ట్ కెమెరా ఆప్షన్ ఉంది. 8.7 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. డాల్డీ ఆటమ్ ఆడియో ఫీచర్ తో మంచి సౌండ్ క్లారిటీని అందిస్తుంది. 32జీబీ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. దీనిపై అమెజాన్ ప్లాట్ ఫారంలో 26శాతం తగ్గింపు ఉంది. ప్రస్తుతం దీని ధర రూ. 12,940గా ఉంది.
రియల్ మీ ప్యాడ్ వైఫై 4జీ ట్యాబ్లెట్.. మన దేశంలో లభ్యమయ్యే అత్యత్తుమ ట్యాబ్లెట్లలో ఇదీ ఒకటి. దీనిలో 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 10.8-అంగుళాల స్క్రీన్ పరిమాణంతో ఇది వస్తుంది. ఇది 7100 ఎంఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది కూడా ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేస్తుంది. దీనిపై అమెజాన్ లో 47శాతం తగ్గింపుతో కేవలం రూ. 15,999కే లభ్యమవుతోంది.
లెనోవో ట్యాబ్ ఎం10 హోచ్ డీ 4జీ ట్యాబ్లెట్.. ఈ ట్యాబ్లెట్ లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 429 క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది. 2జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. వెనుకవైపు 5ఎంపీ కెమెరా, ముందు వైపు 2ఎంపీ కెమెరా సెటప్ ఉంటుంది. 10.1 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. దీనిపై కూడా అమెజాన్ లో 46శాతం తగ్గింపు ఉంది. కేవలం రూ. 12,990కే లభ్యమవతోంది.
శామ్‌సంగ్ గేలాక్సీ ట్యాబ్ ఏ8 ఈ ట్యాబ్లెట్ టీవీలా మీకు ఉపయోగపడుతుంది. వార్తలు, సినిమాలు, సంగీతం వంటివి ఆస్వాదించవచ్చు. స్టైలిష్ లుక్ లో కనిపిస్తోంది. యూనిసోక్ టీ618 ప్రాసెసర్ ఉంటుంది. 64జీబీ స్టోరేజ్ సామర్థ్యంత ఉంటుంది. 10.36 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. దీనిపై మీకు అమెజాన్ లో 31శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో కేవలం రూ. 19,999కే దీనిని కొనుగోలు చేయవచ్చు.