ప్రముఖ ఎలాక్ట్రానిక్ దిగ్గజం టెక్నో భారత మార్కెట్లోకి టెక్నో మెగాబుక్ టీ1 పేరుతో కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. ఈ ల్యాప్‌టాప్ కేవలం 1.56 కిలోల బరవు ఉండడం విశేషం.
ధర విషయానికొస్తే టెక్నో మెగాబుక్ టీ1 11th జనరేషన్ ఐ3 కాన్పిగనరేషన్ ధర రూ. 37,999 కాగా ఐ5 కాన్ఫిగరేషన్ ధర రూ. 47,999గా ఉంది. ఇక ఐ7 కాన్ఫిగరేషన్ ధర రూ. 57,999గా ఉంది.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఈ ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంది. డెనిమ్ బ్లూ, స్పేస్ గ్రే, మూన్‌షైన్ సిల్వర్ కలర్స్‌లలో లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ వెబ్ క్యామ్‌ను అందించారు.
ఇక ఈ ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 350 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం. ఇందులో 16 జీబీ ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్‌ను అందించారు.
చార్జింగ్ కోసం టైప్ సీ పోర్ట్‌ను ఇచ్చారు. అలాగే 65 వాట్స్ పీడీ అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 70డబ్ల్యూహెచ్‌ఆర్ బ్యాటరీని అందించారు. ఒక్క ఛార్జ్ చేస్తే ఏకంగా 17.5 గంటలు పనిచేస్తుంది. ల్యాప్‌టాప్ వేడెక్కకుండా వీసీ కూలింగ్ టెక్నాలజీని అందించారు.