సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎఫ్34 రెండు వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 18,999కాగా 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 20,99గా ఉంది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇంఉదలో 6.46 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే సొంతం. కార్నింగ్ గొరిల్లా 5 ప్రొటెక్షన్‌ను ఇచ్చారు.
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ స్మార్ట్ ఫోన్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ 1280 ప్రాసెసర్‌ను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ బరువు 208 గ్రాములు ఉంటుంది.
కెమెరా విషయానికొస్తే సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎఫ్34లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. 6000 ఎమ్‌ఏహెచ్ వంటి పవర్ ఫుల్ బ్యాటరీని అందించారు.
ఇక ఫోన్ సెక్యూరిటీలో భాగంగా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ 5జీ, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ, వైఫై, బ్లూటూద్ వీ5.3, యూఎస్‌బీ టైప్ సీ కనెక్టివిటీ ఫీచర్స్‌ను అందించారు.