
షావోమికి చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో భారత మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. పోకో ఎఫ్4 పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 23న లాంచ్ చేయనున్నారు.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.67 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డీ+అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ 67 వాట్స్ ఫాస్ట్ సపోర్ట్‌తో పనిచేస్తుంది.

క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 870 ఎస్‌ఓసీ చిప్‌సెట్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో లిక్విడ్ కూల్ సిస్టం 2.0 వంటి ప్రత్యేకమైన ఫీచర్లను అందించారు. ధర విషయానికొస్తే రూ. 35,000 లోపు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 64 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో వచ్చే ఈ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్+8 మెగాపిక్సెల్+2 మెగాపిక్సెల్ అందించారు. ఇక సెల్ఫీల కోసం 20 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

జూన్ 23వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు ఈ ఫోన్‌ను లాంచ్‌చేయనున్నారు. స్టోరేజ్ విషయానికొస్తే 256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్‌తో రానున్నట్లు తెలుస్తోంది.