Oppo A58 4G: రూ. 15వేలలో 50 ఎంపీ కెమెరా.. మార్కెట్లోకి దూసుకొస్తున్న మరో కొత్త స్మార్ట్ ఫోన్
యూజర్ల అవసరాలకు అనుగుణంగా మార్కెట్లోకి కొంగొత్త ఫోన్‌లను సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా కెమెరా క్లారిటీ ప్రాధాన్యత ఇస్తూ కొత్త ఫోన్‌లు లాంచ్ చేస్తున్నారు. ఒకప్పుడు 50 ఎంపీ క్లారిటీ ఉండే ఫోన్ కొనుగోలు చేయాలంటే కనీసం రూ. 30 వేలు పెట్టాల్సి వచ్చేది కానీ ప్రస్తుతం రూ. 15 వేలలోనే అలాంటి స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ కోవలోకే వస్తుంది ఒప్పో ఏ58 స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 14,999గా ఉంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..