
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ ఒప్పో తాజాగా సరికొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఒప్పో ఏ95 పేరుతో లాంచ్ చేసిన 4 జీ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయాంటే..

ఈ స్మార్ట్ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 SoC ప్రాసెసర్‌ను అందించారు. దీంతో పాటు 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ (1,080×2,400 పిక్సెల్స్) అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇచ్చారు.

ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్‌తో పాటు 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు.

కెమెరా విషయానికొస్తో ఈ ఫోన్‌లో 48 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఇక ఈ ఫోన్‌లో 33W VOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిచ్చే 5,000mAh బ్యాటరీని చేర్చింది. అందించారు. ఫోన్ ధర విషయానికొస్తే రూ. 16,600గా ఉంది.