ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ నోకియా జోరు పెంచింది. వరుసగా కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ మార్కెట్‌ను హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్తఫోన్‌ను లాంచ్ చేసింది. నోకియా సీ 30 పేరుతో గురువారం ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు.
ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.83 ఇంచెస్ హెచ్‌డీ+ డిస్‌ప్లేతో పాటు 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంతో నడిచే ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ యూనిసోక్ ఎస్‌సీ9863ఏ ప్రాసెసర్‌ను ఉపయోగించారు.
6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్‌లో వెనుకవైపు ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ సిస్టమ్, బ్లూటూత్ 4.2 వెర్షన్‌ను అందించారు.
ఇక కెమెరా విషయానికొస్తే.. 13 మెగా పిక్సెల్స్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.
ఇక ధర విషయానికొస్తే.. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ రూ. 10,999గా ఉండగా.. 4జీబీ ర్యామ్ + 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ ఫోన్ రూ. 11,999గా ఉంది.