చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం నాయిస్ భారత మార్కెట్లోకి తాజాగా నాయిస్ కలర్‌ఫిట్ ఐకాన్ 2 పేరుతో కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. ఈ వాచ్ ధర విషయానికొస్తే రూ. 1,999గా ఉంది. రూ. 2వేల లోపు బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్ వాచ్‌లో ఇదీ ఒకటి చెప్పొచ్చు.
ఇక ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.8 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే కావడంతో డిస్‌ప్లే క్లారిటీ విషయంలో రాజీ ఉండదు.
ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ వాచ్ ఎలైట్ బ్లాక్, ఎలైట్ సిల్వర్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. ధర విషయానికొస్తే రూ. 1,999గా ఉంది.
వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీతో రూపొందించిన ఈ స్మార్ట్ వాచ్‌లో హార్ట్ రేట్ సెన్సార్, ఎస్‌పీఓ2 మానిటర్ వంటి హెల్త్ ఫీచర్లను అందించారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడని వాయిస్ అసిస్టెంట్‌తో పాటు సిరీ, గూగుల్ అసిస్టెంట్లను అందించారు.
ఈ స్మార్ట్ వాచ్‌లో స్పీకర్‌తో పాటు ఇన్‌బుల్ట్‌గా మైక్రోఫోన్‌ను కూడా అందించారు. 10 కాంటాక్ట్స్‌ను స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. 60కిపైగా స్పోర్ట్స్ మోడ్స్‌తో పాటు 150కిపైగా వాచ్ ఫేస్‌లను ఇందులో ఇచ్చారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 7 రోజులు పనిచేస్తుంది.