ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ మోటొరాలో మార్కెట్లోకి ఇటీవల వరుసగా బడ్జెట్ ఫోన్‌లను తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా భారత మార్కెట్లోకి మోటో జీ53 పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్ అన్ని రకాల అత్యాధునిక ఫీచర్లు ఈ ఫోన్ సొంతం.
మోటో జీ52 4జీ ఫోన్‌ను కొనసాగింపుగా ఈ 5జీ వెర్షన్‌తో తీసుకొస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో భారత్‌లో తొలి సేల్ ప్రారంభం కానుంది. అయితే ధర తక్కువే అయినప్పటికీ ఫీచర్ల విషయంలో మాత్రం రాజీపడలేదు సంస్థ.
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచెస్ 120 హెచ్‌జడ్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. క్వాల్‌కాం ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో ఈ నెలలో అందుబాటులోకి రానుంది.
ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. తక్కువ బడ్జెట్‌లో 5జీ ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.
ధర విషయానికొస్తే మోటో జీ53 5జీ బేస్ మోడల్ భారత కరెన్సీ ప్రకారం రూ. 10,700కి లభించనుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర దాదాపు రూ.13,000గా ఉండనుంది. ఇక ఈ ఫోన్‌లో 18డబ్ల్యూ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.