Moto E32: మోటొరోలా నుంచి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. రూ. 12 వేల బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు..

|

May 06, 2022 | 8:08 AM

Moto E32: ఇటీవల వరుసగా స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోన్న ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటొరోలా తాజాగా మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. మోటో ఈ 32 పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ ప్రస్తుంత యూరప్‌లో అందుబాటులోకి రాగా, త్వరలోనే భారత్‌లో విడుదల కానుంది..

1 / 5
ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటొరోలా ఇటీవల వరుసగా స్మార్ట్‌ ఫోన్స్‌ విడుదల చేస్తూ వస్తోంది. తక్కువ బడ్జెట్‌ ఫోన్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్న మోటొరోలా తాజాగా మోటో ఈ32 పేరుతో మరో కొత్త ఫోన్‌ను యూరప్‌లో లాంచ్‌ చేసింది. త్వరలోనే భారత్‌లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది.

2 / 5
ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.5 ఇంచెస్‌ 90 హెచ్‌జెడ్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో G 37 చిప్‌ను అందించారు.

3 / 5
 మోటో ఈ32 స్మార్ట్‌ ఫోన్‌లో 18వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ ఈ ఫోన్‌ ప్రత్యేకత.

4 / 5
ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ అందించారు. వీటిలో 16MP మెయిన్, 2MP పోర్ట్రెయిట్, మరో 2MP మాక్రో షూటర్‌ ఈ సెటప్‌లో ఉన్నాయి. సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

5 / 5
ధర విషయానికొస్తే యూరప్‌లో ఈ ఫోన్‌ ధర 149 EURగా ఉంది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 12,000గా చెప్పొచ్చు. మరి ఈ ఫోన్‌లో భారత్‌లో ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి.