ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటోరోలా తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటో ఈ40 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి.
ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. 6.5-అంగుళాల హెచ్‌డి+ ఐపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లేతో పాటు 1,600×720 పిక్సెల్స్ రిజల్యూషన్ విత్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అందించారు.
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే ఈ ఫోన్‌లో 4జీబీ ర్యామ్+ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ని అందించారు. ఈ ఫోన్ రూ. 9,499కి అందుబాటులో ఉంది.
కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 42 మెగాపిక్సెల్స్ రెయిర్ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
యునిసోక్ టీ700 ప్రాసెసర్ అందించిన ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 40 గంటలపాటు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.
ఈ ఫోన్‌ను కేవలం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంచారు. ఇప్పటికే ఒక సేల్ ముగియగా మరో సేల్ నిర్వహించేదుకు సిద్ధమవుతున్నారు.