Narender Vaitla |
Jun 27, 2023 | 8:15 PM
స్మార్ట్ ఫోన్ యూజర్లు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. మోటోరోలా కంపెనీకి చెందిన మోటో జీ32 స్మార్ట్ ఫోన్ సేల్స్ ప్రారంభమయ్యాయి. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
మోటీ జీ32 ఫోన్ ప్రారంభ ధర రూ. 11,999గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. సూపర్ స్మూత్ 90 హెర్ట్జ్ ఈ స్క్రీన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఒక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పని చేస్తుంది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
మోటో జీ32 ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, 33 వాట్ల టర్బో పవర్ చార్జర్‌ను ఇచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఇచ్చారు.
ఇక ఇందులో సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్‌ను అందించారు. ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై పలు కార్డులపై రూ. 1000 డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో పాటు పాత ఫోన్‌ను ఎక్స్జేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 5వేల డిస్కౌంట్ పొందొచ్చు.