
2022లో ఎక్కవ మంది డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌గా టిక్‌టాక్ పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం భారత్‌లో నిషేధించిన ఈ యాప్‌ను ఏకంగా 672 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. భారత కరెన్సీ ప్రకారం టిక్‌టాక్ వార్షిక ఆదాయం ఏకంగా రూ. 783 వేల కోట్లుగా ఉందని తెలిపింది.

ఇక ఎక్కువ మంది ఉపయోగిస్తున్న సోషల్ మీడియాలో యాప్‌లలో ఇన్‌స్టాగ్రామ్ - 547 మిలియన్స్, ఫేస్‌బుక్ - 449 మిలియన్స్, వాట్సాప్ 424 మిలియన్స్, టెలిగ్రామ్ -310 మిలియన్స్, ఫేస్‌బుక్ మెసెంజర్ - 210 మిలియన్స్ ఉన్నాయి. ఇక షాపింగ్ విభాగంలో 'షీఇన్' యాప్ మొదటి స్థానంలో నిలిచింది.

తర్వాత స్థానంలో 210 మిలియన్ డౌన్‌లోడ్స్‌తో మీషో యాప్ నిలిచింది. ఇక గేమ్స్ విషయానికొస్తే.. 304 మిలియన్ల డౌన్‌లోడ్స్‌తో 'సబ్వే సర్ఫర్స్' మొదటి స్థానంలో నిలిచింది. 'క్యాండీ క్రష్'ను ప్రపంచ వ్యాప్తంగా 138 మిలియన్ల యూజర్లు ఉపయోగిస్తున్నారు.

ట్రావెల్ విషయానికొస్తే.. గూగుల్ మ్యాప్ 113 మిలియన్స్‌తో మొదటి స్థానంలో ఉండగా, 127 మిలియన్స్ డౌన్‌లోడ్స్‌తో మెక్ డొనాల్డ్స్ నిలిచింది. మ్యూజిక్ విభాగంలో స్పాటిఫై - 238 మిలియన్స్ డౌన్‌లోడ్స్‌తో మొదటి స్థానంలో ఉంది.

ఇక మనీ ట్రాన్స్‌ఫర్ యాప్‌ల విషయానికొస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది 'ఫోన్ పే'ను ఉపయోగిస్తున్నారు. సుమారు 94 మిలియన్ల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. తర్వాత పేపాల్ - 92 మిలియన్స్, గూగుల్ పే - 69 మిలియన్స్, పేటీఎమ్ - 60 మిలియన్స్ ఉన్నాయి.