Narender Vaitla |
Jun 30, 2023 | 4:43 PM
మార్కెట్లోకి మరో ఆసక్తికరమైన స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఐటెల్ కంపెనీ బడ్జెట్ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఐటెల్ పీ40+ పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు.
అమెజాన్‌లో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ లాంచింగ్ డేట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను త్వరలోనే చేయనున్నారు. ఇక ఈ ఫోన్ ధర రూ. 9 వేలలోపే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు ఈ ఫోన్ ఫీచర్స్‌కి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ నెట్టింట వైరల్ అవుతోన్న పోస్టుల ఆధారంగా.. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.8 ఇంచెస్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించనున్నారు.
ఈస్మార్ట్ ఫోన్ 4GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌లో వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ ఫోన్ యూనిసెక్ టీ606 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించనున్నారు.
ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 13 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 7000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నారు.