Smart 8 HD: రూ. 10 వేలలోపు అదిరిపోయే స్మార్ట్‌ ఫోన్‌.. ఇన్‌ఫినిక్స్‌ నుంచి..

|

Nov 25, 2023 | 4:30 PM

బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొత్త కొత్త ఫోన్‌లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. తక్కువ ధర ఫోన్‌లకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో కంపెనీలు సైతం ఈ సెగ్మెంట్‌ ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్ దిగ్గజం ఇన్‌ఫినిక్స్‌ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. స్మార్ట్‌ 8 హెచ్‌డీ పేరుతో తీసుకురానున్న ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలు..

1 / 5
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఇన్‌ఫినిక్స్‌ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. స్మార్ట్‌7 హెచ్‌డీకి కొనసాగింపుగా 'స్మార్ట్‌8 హెచ్‌డీ'ని తీసుకొస్తున్నారు. డిసెంబర్‌ 8వ తేదీన భారత్‌లో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. క్రిస్టల్ గ్రీన్, గెలాక్సీ వైట్, షైనీ గోల్డ్, టింబర్ బ్లాక్ కలర్స్‌లో ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు.

2 / 5
ధర విషయంపై ఇప్పటి వరకు కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక ఫీచర్స్ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.6 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌, సన్‌లైట్‌ రీడబుల్‌ ఈ స్క్రీన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

3 / 5
ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 5000 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వనున్నారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 39 గంటల పాటు పనిచేస్తుంది. పంచ్‌ హోల్‌తో కూడిన సెల్ఫీ కెమెరాను అందించనున్నారు.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్‌, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇవ్వనున్నారు.

5 / 5
ఈ ఫోన్‌కు ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను సైడ్‌కు అందించారు. ఇక ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ. 10 వేలలోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.