Infinix Note 40X: కళ్లు చెదిరే డిజైన్‌తో స్టన్నింగ్ ఫోన్‌.. ధర మాత్రం చాలా తక్కువ

తక్కువ ధరలో అధునాతన ఫీచర్లు, అద్భుతమైన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నాయి కంపెనీలు. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా 5జీ సేవలు విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో స్మార్ట్ ఫోన్‌ తయారీ కంపెనీలు 5జీ ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో యూజర్లను అట్రాక్ట్‌ చేసే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తాజాగా చైనాకు చెంది స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం...

Infinix Note 40X: కళ్లు చెదిరే డిజైన్‌తో స్టన్నింగ్ ఫోన్‌.. ధర మాత్రం చాలా తక్కువ
Infinix Note 40x
Follow us

|

Updated on: Aug 05, 2024 | 3:50 PM

తక్కువ ధరలో అధునాతన ఫీచర్లు, అద్భుతమైన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నాయి కంపెనీలు. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా 5జీ సేవలు విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో స్మార్ట్ ఫోన్‌ తయారీ కంపెనీలు 5జీ ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో యూజర్లను అట్రాక్ట్‌ చేసే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తాజాగా చైనాకు చెంది స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఇన్‌ఫినిక్స్‌ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇన్‌ఫినిక్స్‌ నోట్ 40 ఎక్స్‌ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇన్‌ఫినిక్స్‌ నోట్‌ 40 ఎక్స్‌ స్మార్ట్ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లో తీసుకొచ్చిన ప్రీమియం లుక్‌తో లాంచ్‌ చేశారు. ఈ ఫోన్‌ బ్యాక్‌ ప్యానెల్‌ చూస్తే అచ్చంగా ఐ ఫోన్‌ను పోలినట్లు ఉండడం ఇవేషం. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించారు. యాపిల్‌ డైనమిక్‌ ఐలాండ్‌ తరహాలోనే డైనమిక్‌ పోర్ట్ ఫీచర్‌ ఈ ఫోన్‌ మరో ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ డైనమిక్‌ ఐలాండ్‌లో ఛార్జింగ్‌ యానిమేషన్‌, లో బ్యాటరీ ఇండికేషన్‌, ఫేస్‌ అన్‌లాక్‌ వంటి సమాచాచరం కనిపిస్తుంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది ఇక ఈ ఫోన్‌ను 8 జీబీ, 12 జీబీ ర్యామ్‌తో లాంచ్‌ చేశారు. 500 నిట్స్‌ బ్రైట్నెస్‌, 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ ఫోన్‌లో ట్రిపుల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాను అందించారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 18 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు.

ఇక సెక్యూరిటీ కోసం ఇందులో ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌ అథెంటికేషన్‌ అందించారు డీటీఎస్‌ ఆడియో ప్రాసెసింగ్‌తో కూడిన డ్యుయల్‌ స్పీకర్లు ఇచ్చారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో.. బ్లూటూత్‌ 5.2, వైఫై 5.0, ఎన్‌ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇచ్చారు. ఇక ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 14,999 కాగా.. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999గా నిర్ణయించారు. బ్యాంక్‌ ఆఫర్లలో భాగంగా రూ. 1000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఆగస్టు 9వ తేదీ నుంచి ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

కళ్లు చెదిరే డిజైన్‌తో స్టన్నింగ్ ఫోన్‌.. ధర మాత్రం చాలా తక్కువ
కళ్లు చెదిరే డిజైన్‌తో స్టన్నింగ్ ఫోన్‌.. ధర మాత్రం చాలా తక్కువ
మరోసారి నెటిజన్ల హృదయాన్ని గెలుచుకున్న అనంత్ అంబానీ..
మరోసారి నెటిజన్ల హృదయాన్ని గెలుచుకున్న అనంత్ అంబానీ..
లైవ్ మ్యాచ్‌లో ఎన్నడు చూడని అద్భుతం.. వీడియో చూస్తే ఫిదానే
లైవ్ మ్యాచ్‌లో ఎన్నడు చూడని అద్భుతం.. వీడియో చూస్తే ఫిదానే
అపూర్వ ఘట్టానికి ఐదేళ్లు.. ఆర్టికల్‌ 370 రద్దుపై ప్రధాని మోదీ
అపూర్వ ఘట్టానికి ఐదేళ్లు.. ఆర్టికల్‌ 370 రద్దుపై ప్రధాని మోదీ
రాగి బాటిళ్లలో నీటిని తాగడానికి నియమాలున్నాయని తెలుసా..
రాగి బాటిళ్లలో నీటిని తాగడానికి నియమాలున్నాయని తెలుసా..
బౌలింగ్‌లో రోహిత్ శర్మ మ్యాజిక్.. ఖాతాలో ప్రత్యేక రికార్డ్..!
బౌలింగ్‌లో రోహిత్ శర్మ మ్యాజిక్.. ఖాతాలో ప్రత్యేక రికార్డ్..!
చికెన్ ప్రియులకు కిర్రాక్ న్యూస్.. ఈ నెల అంతా ఇంతే...
చికెన్ ప్రియులకు కిర్రాక్ న్యూస్.. ఈ నెల అంతా ఇంతే...
రియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కోసం ఈ టీ ట్రై చేయండి..!
రియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కోసం ఈ టీ ట్రై చేయండి..!
ఇక్కడ నీరు తాగితే వ్యాధులు నయం శతాబ్దాలుగా ఎండిపోనినీరు ఎక్కడంటే
ఇక్కడ నీరు తాగితే వ్యాధులు నయం శతాబ్దాలుగా ఎండిపోనినీరు ఎక్కడంటే
సైనికపాలన దిశగా బంగ్లాదేశ్‌.. ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా
సైనికపాలన దిశగా బంగ్లాదేశ్‌.. ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా