పబ్లిక్ ప్లేస్‌లలో మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ పెడుతున్నారా? కొంపమునుగుతుంది జాగ్రత్త..
31 July 2024
TV9 Telugu
TV9 Telugu
బహిరంగ ప్రదేశాల్లోని యూఎస్‌బీ ఛార్జింగ్ పాయింట్ల సాయంతో మొబైల్ ఫోన్ల ఛార్జింగ్ చేయొద్దని కేంద్రం తరఫున ‘కంప్యూటర్ అత్యవసర స్పందన బృందం’ (సీఈఆర్‌టీ-ఇన్) హెచ్చరిక జారీ చేసింది
TV9 Telugu
అంటే బస్టాండ్లు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటుచేసిన యూఎస్‌బీ ఛార్జింగ్ స్టేషన్లు ఆసరాగా చేసుకొని కొందరు నేరగాళ్లు సైబర్ దాడులకు పాల్పడుతున్నారు
TV9 Telugu
వినియోగదారుల వ్యక్తిగత డేటాను దొంగిలించడానికి, లేదా వారి పరికరాల్లో మాల్వేర్‌ను జొప్పించడానికి ఛార్జింగ్ పోర్ట్స్‌ను ఉపయోగించుకుంటున్నారు. చాలా మంది బయటకు వెళ్లినప్పుడు అకస్మాత్తుగా ఫోన్ ఛార్జ్ అయిపోతే దగ్గర్లోని పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్లకు వెళ్లి తమ మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ పెడుతుంటారు
TV9 Telugu
అయితే ఇలా ఛార్జింగ్ కోసం డేటా కేబుల్‌ను ఇన్‌స్టాల్ చేసినప్పుడు సైబర్ నేరగాళ్లు ఫోన్‌లోని మొత్తం డేటాను చోరీ చేస్తున్నారు. తద్వారా ఫోన్‌లోని బ్యాంకు వివరాలన్నీ మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లవచ్చు
TV9 Telugu
పైగా వారిచేతిలోకి చేరిన డేటా ద్వారా మీ వ్యక్తిగత జీవితంలోకి చొరబడి, లేనిపోని సమస్యలను సృష్టించే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి
TV9 Telugu
నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు ఎక్కడ ఛార్జ్ చేసినా వ్యక్తిగత ఛార్జర్‌లకు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. లేదంటే వ్యక్తిగత పవర్ బ్యాంక్‌ని అయినా ఉపయోగించాలి
TV9 Telugu
ఒకవేళ మీ వద్ద ఛార్జింగ్ సిస్టమ్ లేకపోతే డేటా కేబుల్‌ను 'కనెక్ట్' చేసిన తర్వాత 'డేటా ట్రాన్స్‌ఫర్' ఎంపికను ఎంచుకోవద్దు. 'ఛార్జ్ మాత్రమే' ఎంపిక చేసుకుని దానిపై క్లిక్ చేయాలి
TV9 Telugu
అలాగే ఛార్జింగ్ చేయడానికి ముందు ఫోన్ సెట్టింగ్‌లోకి వెళ్లి, 'ఆటో సింక్రొనైజ్డ్' ఎంపికను ఆఫ్ చేయాలి. ఇలా చేస్తే ఫోన్‌లోకి ఏదైనా డేంజర్ వైరస్ వచ్చినా, అది ఫోన్‌కు హాని కలిగించదు. కాబట్టి యాంటీ వైరస్ కూడా ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అలాగే మీ USB డేటా బ్లాకర్ అప్లికేషన్‌ను విడిగా కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు