01 August 2024

అత్యంత సన్నని కర్వ్డ్‌ డిస్‌ప్లే ఫోన్‌.. 

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మోటోరోలో ఎడ్జ్‌ 50 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఎడ్జ్‌ 50 సిరీస్‌కు వచ్చిన ఆదరణతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు.

ఈ సెగ్మెంట్‌లో తీసుకొచ్చిన అత్యంత సన్నని MIL-810H-రేటెడ్ కర్వ్‌డ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఇదే అని కంపెనీ చెబుతోంది. ఆగస్టు 8వ తేదీ నుంచి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

ధర విషయానికొస్తే మోటో ఎడ్జ్‌ 50.. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 27,999గా నిర్ణయించారు. ఫ్లిప్‌కార్ట్ వేదికగా ఈ స్మార్ట్ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. 

లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేసిన వారికి రూ. 2 వేలు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఫోన్‌ను జంగిల్ గ్రీన్, పాంటోన్ పీచ్ ఫజ్ కలర్స్‌లో తీసుకొచ్చారు.

ఈ ఫోన్‌ను లెథర్‌ ఫినిష్‌తో తీసుకొచ్చారు. ఇక ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌ 1.5 కే సూపర్‌ హెచ్‌డీ పీఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1900 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం.

ఈ ఫోన్‌లో స్మార్ట్‌ వాటర్‌ టచ్‌ టెక్నాలజీని అందిస్తున్నారు. అంటే తడి చేతులతో టచ్‌ చేసినా ఫోన్‌ పనిచేస్తుందన్నమాట. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 7జెన్‌ 1ఏఈ చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించనున్నారు.

ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తే ఈ ఫోన్‌లో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను అందించారు. 50 ఎంపీ రెయిర్‌ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 68 వాట్స్‌కు సపోర్ట్ చేసేత 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందంచారు. అలాగే 15 వాట్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. IP68 రేటింగ్‌ను అందిస్తున్నారు.