
ఇన్ఫినిక్స్ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్‌లో అమ్మకాలు జరుగుతున్నాయి.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.82 ఇంచెస్ డిస్‌ప్లేతో పాండా ఎంఎన్228 గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ యూనిసాక్ టీ610 ప్రాసెసర్‌ను అందించారు.

ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగా పిక్సెల్ రెయిర్ కెమరాతో పాటు 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఇందులో 6000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఇచ్చారు. ర్యామ్‌ను వర్చువల్‌గా మరో 3 జీబీ వరకు ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. అలాగే ఎస్‌డీ కార్డుతో స్టోరేజీని 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ 4GB ర్యామ్/64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ. 8,499కి అందుబాటులో ఉంది.