YouTube: మీ చిన్నారులు యూట్యూబ్‌ చూస్తున్నారా.? అలాంటి వీడియోలు రాకూడదంటే..

|

Apr 22, 2024 | 1:52 PM

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్‌ వినియోగం అనివార్యంగా మారింది. స్కూలుకు కూడా వెళ్లని చిన్నారులు సైతం స్మార్ట్ ఫోన్‌లకు అడిక్ట్‌ అవుతున్నారు. గ్రౌండ్‌లో ఆటలు ఆడుకోవాల్సిన వాళ్లు స్మార్ట్‌ ష్క్రీన్‌కు అతుక్కుపోతున్నారు. ఈ క్రమంలోనే చిన్నారులు తమకు తెలిసో తెలియకో అసభ్యకరమైన కంటెంట్‌ చూసే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఒక చిన్న సెట్టింగ్‌ ద్వారా యూట్యూబ్‌లో అభ్యంతకర వీడియోలకు చెక్‌ పెట్టొచ్చు..

1 / 5
చిన్నారులకు స్మార్ట్‌ ఫోన్‌ ఇవ్వగానే తొలుత చేసే పని యూట్యూబ్‌ ఓపెన్‌ చేసి వీడియోలు చూడడం. రీల్స్‌, వీడియోలు ఇలా రకరకాల కంటెంట్‌ను వీక్షిస్తుంటారు. అయితే ఇదే క్రమంలోనే వారి ప్రమోయం లేకుండానే కొన్ని రకాల అభ్యంతకర వీడియోలు కూడా వస్తుంటాయి.

2 / 5
మరి చిన్నారులకు ఇలాంటి కంటెంట్‌ కనిపించకుండా చేసే మార్గం లేదా అంటే కచ్చితంగా ఉంది. ఒక చిన్న సెట్టింగ్‌  ద్వారా అభ్యంతకర వీడియోలు మీ చిన్నారులకు కనిపించకుండా చేయొచ్చు. ఇంతకీ ఆ సెట్టింగ్స్‌ ఏంటి.? ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

3 / 5
ఇందుకోసం ముందుగా మీ ఫోన్‌లో యూట్యూబ్‌ యాప్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం మీ ప్రొఫెల్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత సెట్టింగ్‌ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకొని. జనరల్‌ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.

4 / 5
తర్వాత కిందికి స్క్రోల్ చేయాలి. ఇలా చేస్తే మీకు రిస్ట్రిక్టెడ్‌ మోడ్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానికి సెలక్ట్ చేసుకోవాలి. ఈ సెట్టింగ్‌ను ఆన్‌ చేసుకోవడం ద్వారా యూట్యూబ్‌లో వచ్చే ఫీడ్‌లో అభ్యంతకర వీడియోలు కనిపించడం ఆగిపోతాయి. దీంతో మీ పిల్లలు యూట్యూబ్‌ను ఆపరేట్‌ చేసే సమయంలో ఎలాంటి అభ్యంతకర వీడియోలు చూపించవు.

5 / 5
వీటితో పాటు కొన్ని రకాల పేరెంటింగ్ యాప్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా మీ చిన్నారులు ఫోన్‌లో ఏం చేస్తున్నారు.? ఎలాంటి కంటెంట్‌ను కంట్రోల్‌ చేయొచ్చనే విషయాలను మీరే కంట్రోల్‌ చేసుకోవచ్చు.