వాట్సాప్.. గ్లోబల్ వైడ్ గా మెసేజింగ్ ప్లాట్ ఫారంలో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. వాట్సాప్ వచ్చిన కొత్తలో కేవలం మెసేజ్ లు పంపడానికి మాత్రమే ఉపయోగపడేది. అయితే రానురానూ సరకొత్త ఫీచర్లు వాట్సాప్ లో అందుబాటులోకి వచ్చాయి. వాట్సాప్ స్టేటస్, గ్రూప్స్, కమ్యూనిటీలు, పేమెంట్లు వంటి అనేక ఫీచర్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.
వాట్సాప్ లోనే చాలా సున్నితమైన వ్యక్తిగత డేటా ఉంటుంది. అది ఎవరైనా బయటి వ్యక్తుల చేతుల్లోకైనా వెళ్తే ఇబ్బందులు తలెత్తుతాయి. ఒకవేళ మీ ఫోన్ పోయినా, సిమ్ పోయినా వేరే వారు ఆ ఫోన్ లేదా, సిమ్ తోనే మీ వాట్సాప్ ను యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది.
చాలా మంది వాట్సాప్ కి ప్రైవేట్ లాక్ యాప్స్ ద్వారా పిన్ పెట్టుకొని లాక్ చేస్తుంటారు. అయితే ఇకపై అవసరం లేకుండానే వాట్సాప్ టూ ఫ్యాక్టర్ అథంటికేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇటీవల చాట్ లాక్ ఫీచర్ ను ఆవిష్కరించిన వాట్సాప్ మరో అడుగు ముందుకేస్తూ టూ ఫ్యాక్టర్ అథంటికేషన్ ను తీసుకొచ్చింది.
ఈ టూ ఫ్యాక్టర్ అథంటికేషన్ ను యాక్టివేట్ చేయడానికి మీరు వాట్సాప్ లోకి వెళ్లి కుడిచేతివైపు ఉండే మూడు చుక్కలపై క్లిక్ చేసి, దానిలో సెట్టింగ్స్ ను ఓపెన్ చేయాలి. దానిలో అకౌంట్ పై క్లిక్ చేసి టూ స్టెప్ వెరిఫికేషన్ ను ఎంపిక చేసుకోవాలి. దానిని యాక్టివేట్ చేయడానికి ఆరు అంకెలతో కూడిన పిన్ ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత కనఫర్మ్ కొడితే వాట్సాప్ సెక్యూర్ అవుతుంది. అవసరం అయితే ఈ మెయిల్ కూడా ఇవ్వవచ్చు. లేదా స్కిప్ చేయొచ్చు.
ఇక మీ వాట్సాప్ ఓపెన్ చేయాలంటే ఆ ఆరు అంకెల పిన్ ఎంటర్ చేయాల్సిందే. అది లేకుండా మీరు వాట్సాప్ ను యాక్సెస్ చేయలేరు. అలాగే యాప్ లోపలికి వెళ్లాక చాట్ లను ఇదే విధానంలో లాక్ చేసుకోవచ్చు