
హానర్ 90 5జీ.. ఈ ఫోన్లో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 యాక్సెలరేటెడ్ ఎడిషన్ 5జీ ఆధారంగా పనిచేస్తుంది. వెనుకవైపు ఏకంగా 200ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. ముందు వైపు 50ఎంపీ సెల్ఫీ కెమెరా వస్తుంది. దీని ధర రూ. 19,999గా ఉంది.

యాపిల్ ఐఫోన్13.. ఈ ఫోన్లో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్ డీఆర్ డిస్ ప్లే ఉంటుంది. డ్యూయల్ 12ఎంపీ కెమెరాలు, 4కే డాల్బీ విజన్ హెచ్ డీఆర్ రికార్డింగ్ ఉంటుంది. ఏ15 బయోనిక్ చిప్ ఆధారంగా పనిచేస్తుంది. దీని ధర రూ. 48,999గా ఉంది.

రియల్ మీ నార్జో 60ఎక్స్ 5జీ.. ఈ స్మార్ట్ ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ఆధారంగా పనిచేస్తుంది. ఫోన్ వెనుకవైపు 50ఎంపీ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో ఉంటుంది. దీని ధర రూ. 11,999గా ఉంది.

రెడ్ మీ 13సీ 5జీ.. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.74 అంగుళాల 90హెర్జ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6100ప్లస్ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. ఫోన్ వెనుకవైపు 50ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. అలాగే బ్యాటరీ 5000ఎంఏహెచ్ తో పాటు 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. దీని ధర రూ. 10,999 నుంచి ప్రారంభమవుతుంది.

ఐకూ జెడ్7ఎస్ 5జీ.. ట్రెండింగ్ బ్రాండ్ ఐకూ నుంచి వచ్చిన ఈ ఫోన్ ఫీచర్ ప్యాక్డ్ గా ఉంది. దీనిలో 6.38అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ తో శక్తిని పొందుతుంది. ఇక కెమెరా విషయానికి వస్తే 64ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో వస్తుంది. దీని ధర రూ. 14,999గా ఉంది.