Google Pixel 6a: భారత మార్కెట్లోకి వచ్చేస్తున్న గూగుల్‌ కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. ధర, ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే..

|

Jul 20, 2022 | 6:55 AM

Google Pixel 6a: ప్రముఖ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. గూగుల్‌ పిక్సెల్‌ 6ఏ పేరుతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో అధునాతన ఫీచర్లను అందిస్తున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత ఉంటుందన్న విషయాలు మీకోసం..

1 / 5
గూగుల్‌ పిక్సెల్‌ 6ఏను త్వరలోనే భారత మార్కెట్లోకి లాంచ్‌ చేయనున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఈ నెలఖారులోగా ఫోన్‌ లాంచ్‌ కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గూగుల్‌ పిక్సెల్‌ 6ఏ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లపై ఓ లుక్కేయండి.

2 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌ గూగుల్‌ సొంత ప్రాసెసర్‌ టెన్సార్‌పై పని చేస్తుంది. ఇందులో 60 హెచ్‌జెడ్‌తో కూడిన 6.1 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.

3 / 5
6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో తీసుకురానున్న ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 18 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేస 4410 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వనున్నారు.

4 / 5
 కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌లో వెనకాల 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

5 / 5
ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర భారత మార్కెట్లో సుమారు రూ. 37,000గా ఉండనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.