
ఇకపై మీరు జీమెయిల్ ఐడీని సులువుగా మార్చుకోవచ్చు. పాత జీమెయిల్ ఐడీని ఈజీగా సెకన్లలోనే మార్చుకుని ఉపయోగించుకోవచ్చు. మరో జీమెయిల్ ఐడీని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా పాత జీమెయిల్ నేమ్‌ను అప్డేట్ చేసుకునే అవకాశం గూగుల్ కల్పిస్తోంది. గత సంవత్సరం నుంచి ఈ ఫీచర్‌ను పరీక్షిస్తుండగా.. ఇప్పుడు వినియోగదారులందరికీ అందుబాటులోకి తెచ్చింది.

ఈ అప్డేట్ గురించి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఎక్స్‌లో వెల్లలడించారు. "2004 మంచి సంవత్సరం. కానీ మీజీమెయిల్ ఐడీ అడ్రస్ దానికి పరిమితమైపోనవసరం లేదు. “v0t3f0rp3dr02004@gmail.com లేదా mrbrightside416@gmail.com లాంటి మెయిల్ ఐడీని మార్చుకోవడానికి మీ గూగుల్ ఖాతా సెట్టింగ్స్‌లోకి వెళ్లి అందుబాటులో ఉన్న ఏదైనా పేరును ఎంచుకోండి" అంటూ ఆయన పేర్కొన్నారు.

ఈ ఫీచర్ ప్రస్తుతం ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. మీ జీమెయిల్ ఐడీని మార్చిన తర్వాత ఇతరులు మీ కొత్త నేమ్‌కు మెయిల్స్ పంపించాల్సి ఉంటుంది. అయితే పాత మెయిల్ ఐడీ మీ అకౌంట్‌కు లింక్ చేయబడి ఉంటుంది. ఆ పేరును మరొకరు వాడుకోలేరు. కొత్త అడ్రస్ లేనివారు పాత అడ్రస్ ద్వారా మెయిల్స్ పంపించడం కొనసాగించవచ్చు. రెండు అడ్రస్‌లకు వచ్చే మెయిల్స్ ఒకే ఇన్‌బాక్స్‌లో ఉంటాయి.

త్వరలో ఇన్‌బాక్స్‌లో ఏఐ ఫీచర్లను తీసుకొచ్చేందుకు గూగుల్ సిద్దమవుతోంది. ఏఐ ఇన్ బాక్స్ పేరుతో కొత్త ఫీచర్ రానుంది. ఇది ముఖ్యమైన మెయిల్స్‌కు ప్రాధాన్యత ఇచ్చి అనవసరపు మెయిల్స్‌ని తొలగిస్తుంది. బిల్లు చెల్లింపుల వంటి అధిక ప్రాధాన్యత మెయిల్స్ ఇందులో ఉంటాయి. గడువు తేదీతో పాటు బోల్డ్‌గా అలాంటి మెయిల్స్ కనిపిస్తాయి.

ఇక ఏఐ ఇన్‌బాక్స్‌లో ఉండే తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు అనే విభాగంలో ప్రయాణ బుకింగ్స్, రెస్టారెంట్ రిజర్వేషన్ వంటి తాజా సమాచారం ఒకేచోట ఉంటుంది. ప్రస్తుతం యూఎస్‌లో ఎంపిక చేసిన కొంతమంది వినియోగదారులకు ఇది వర్క్ అవుతుంది. రానున్న కాలంలో అందరికీ అందుబాటులోకి రానుంది.