Google Pixel 7 Pro Offer: గూగుల్‌ ఫోన్‌పై కళ్లు చెదిరే ఆఫర్‌.. ఏకంగా రూ. 37వేలు డిస్కౌంట్‌..

|

Nov 11, 2023 | 2:07 PM

ప్రస్తుతం దీపావళి పండగ సీజన్‌ నడుస్తోంది. ఈ సీజన్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో ఈ కామర్స్‌ సైట్స్ పలు డిస్కైంట్స్‌ను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ భారీ సేల్స్‌ను అందిస్తున్నాయి. ఇక ప్రముఖ సెర్జింజన్‌ దిగ్గజం గూగుల్‌ సైతం ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. గూగుల్‌కు చెందిన పిక్సెల్ 7 ప్రో స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంతకీ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్‌ లభిస్తోంది.? ఫీచర్లు ఎలా ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

1 / 5
గూగుల్‌ పిక్సెల్‌ 7 ప్రో స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 74,999గా ఉంది. లాంచింగ్ ధరతో పోల్చితే ఇది రూ. 14,000 తక్కువ. ఒకవేళ ఈ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 500 క్యాష్‌ బ్యాక్‌ పొందొచ్చు. అలాగే ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌పై రూ. 37,100 డిస్కౌంట్‌ పొందొచ్చు. అన్ని ఆఫర్లుపోగా ఈ ఫోన్‌ను రూ. 37,300కి సొంతం చేసుకోవచ్చు.

2 / 5
ఆఫర్లు ఇంతటితో ఆగిపోలేదు.. కాంబో ఆఫర్‌లో భాగంగా గూగుల్ ఇయర్‌బడ్స్‌ను కొనుగోలు చేస్తే గూగూల్ పిక్సెల్ 7 ప్రోపై అదనంగా 25 శాతం డిస్కౌంట్‌ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 27,975కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లపై ఓ లుక్కేయండి.

3 / 5
 గూగుల్ పిక్సెల్‌ 7 ప్రో ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7  ఇంచెస్‌తో కూడిన క్వాడ్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ టెన్సార్ జీ2 ప్రాసెసర్‌పై గూగుల్ పిక్సెల్ 7 ప్రో రన్ కానుంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్‌, 12 మెగాపిక్సెల్‌, 48 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాతో కూడిన ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను అందించారు. సెల్ఫీల కోసం 10.8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

5 / 5
ఇక కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో.. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2 వంటి ఫీచర్స్‌ను అందించారు. ఈ ఫోన్‌ ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్‌లను సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ సేవర్ మోడ్ ద్వారా 72 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ అందిస్తుంది.