Apple Airtag: బైక్‌ కీ ఎక్కడో పెట్టి మర్చిపోతుంటారా.? ఈ గ్యాడ్జెట్‌ మీ కోసమే..

|

Jan 07, 2024 | 10:38 AM

బైక్‌ కీ ఎక్కడో పెట్టేస్తాం తీరా సమయానికి దొరక్కా ఇబ్బంది పడుతుంటాం. మనలో చాలా మంది ఇలాంటి సమస్యను ఎదుర్కొనే ఉంటారు. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టే ఓ గ్యాడ్జెట్ అందుబాటులో ఉందని మీకు తెలుసా.? అదే యాపిల్‌ ఎయిర్‌ ట్యాగ్‌. ఈ ట్రాకింగ్ గ్యాడ్జెట్‌తో బైక్‌ కీ మొదలు, పర్స్‌ వరకు ఎక్కడ పెట్టి మర్చిపోయినా వెంటనే తెలుసుకోవచ్చు. ఇంతకీ ఈ గ్యాడ్జెట్‌ ఎలా పనిచేస్తుందంటే..

1 / 5
యాపిల్ కంపెనీ ఎయిర్‌ట్యాగ్ పేరుతో ఓ చిన్న ట్రాకింగ్ గ్యాడ్జెట్‌ను లాంచ్‌ చేసింది. చూడ్డానికి చాలా చిన్నగా ఉండే ఈ గ్యాడ్జెట్‌ పనితీరు మాత్రం సూపర్‌ అని చెప్పాలి. బైక్‌ కీ మొదలు, పర్స్‌ల వరకు ఈ ట్యాగ్‌ను అటాచ్‌ చేస్తే చాలు ఎక్కడున్నా వెంటనే జాడ పసిగట్టొచ్చు.

2 / 5
ఈ యాపిల్‌ ఎయిర్‌ ట్యాగ్‌ ధర భారత్‌లో రూ. 3,499గా ఉంది. యాపిల్‌ ఎయిర్‌ ట్యాగ్‌ను బ్యాగ్‌లకు, తాళం చెవిలకు అటాచ్‌ చేయాలి. ఈ గ్యాడ్జెట్‌ ప్రిసిషన్ ఫైండింగ్ ద్వారా పని చేస్తాయి.

3 / 5
ఈ గ్యాడ్జెట్‌లో లిథియం 3వీ కాయిన్‌ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీలు సుమారు ఏడాది పాటు నిర్వీరమంగా పనిచేస్తాయి. బ్యాటరీ ధర కూడా పెద్దగా ఏమి ఉండదు.

4 / 5
ఫైండ్‌ మై నెట్‌వర్క్‌ ఆధారంగా ఈ ట్యాగ్‌ ఎక్కడుందో గుర్తించవచ్చు. ఇది పూర్తిగా ఎన్‌క్రిప్టెడ్, గోప్యమైన నెట్‌వర్క్. మీరు దేని కోసం వెతుకుతున్నారో దాని చుట్టుపక్కల ఉన్న డివైస్‌ల లొకేషన్‌ను మీ ఐక్లౌడ్‌కు పంపిస్తాయి, మీ డివైస్‌కు మెసేజ్ కూడా వస్తుంది.

5 / 5
ప్రిసిషన్ ఫైండింగ్ అనేది ఒక సెక్యూర్ ఫీచర్. ఐఫోన్ 11 ఆపైన మొబైల్స్‌కు ఇది పని చేస్తుంది. ఇక ఎయిర్‌ ట్యాగ్‌ను వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్‌గా డిజైన్ చేశారు. ఐపీ67 రేటింగ్‌తో దీనిని రూపొందించారు.