Boat Enigma Z20: బోట్‌ నుంచి కొత్త స్మార్ట్‌ వాచ్‌.. తక్కువ ధరలో హైలెట్ ఫీచర్స్‌..

|

Jan 02, 2024 | 10:09 AM

భారత మార్కెట్లో స్మార్ట్‌ వాచ్‌లు సందడి చేస్తున్నాయి. ఒకప్పుడు భారీ ధర పలికిన స్మార్ట్‌ వాచ్‌లు ప్రస్తుతం కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్‌యంలో తగ్గుముఖం పట్టాయి. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో కూడిన వాచ్‌లు లాంచ్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బోట్ కంపెనీ మార్కెట్లోకి ఓ స్టన్నింగ్ వాచ్‌ను లాంచ్‌ చేసింది. బోట్‌ ఎనిగ్మా జెడ్‌20 పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
భారత్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ తయారీ సంస్థ బోట్‌.. భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసింది. ఎనిగ్మా జెడ్‌20 పేరుతో ఈ వాచ్‌ను తీసుకొచ్చారు. తక్కువ బడ్జెట్‌లో హై-టెన్సైల్ మెటల్‌తో ఈ వాచ్‌ను చాలా ధృడంగా రూపొందించారు.

2 / 5
ఇక ఈ వాచ్‌ను రబ్టర్‌ స్ట్రాప్‌, లెదర్‌ స్ట్రాప్‌లో తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే రబ్బర్‌ స్ట్రాస్‌తో వచ్చే వాచ్‌ ధర రూ. 3,299కాగా, బ్రౌన్‌ లెదర్‌ స్ట్రాప్‌ వాచ్‌ ధర రూ. 3499గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ వాచ్‌ అమెజాన్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

3 / 5
బోట్‌ ఎనిగ్మా జెడ్‌20 స్మార్ట్‌ వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. రౌండ్ డిస్‌ప్లే డిజైన్‌తో తీసుకొచ్చింది. 1.51 ఇంచెస్‌తో కూడిన హచ్‌డీ ఎల్‌సీడీ స్క్రీన్ను అందించారు. 360x360 రిజల్యూషన్, 600 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్ సొంతం.

4 / 5
ఇక ఈ స్మార్ట్‌ వాచ్‌ బ్లూటూద్‌ కాలింగ్‌ సపోర్ట్‌ను ఇచ్చారు. ఇందుకోసం మైక్రో స్పీకర్‌ను అందించారు. బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ ఉంది. వాచ్‌లో 250 కాంటాక్ట్‌లను సేవ్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ SOS ఫీచర్‌ కూడా ఉంది.

5 / 5
హెల్త్‌ ఫీచర్ల విషయానికొస్తే.. హార్ట్‌బీట్ మానిటర్, SpO2తో పాటు ఫిట్‌నెస్ ట్రాకర్లను అందించారు. వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, బిల్ట్-ఇన్ గేమ్‌లు, మ్యూజిక్ కంట్రోల్, అలారం వంటి ఫీచర్లను అందించారు. అలాగే దుమ్ము, ధూళి నుంచి రక్షణ కోసం IP68 రేటింగ్‌ను ఇచ్చారు.