Smartphone: బెస్ట్‌ కెమెరా ఫోన్‌ కోసం చూస్తున్నారా.? రూ. 30 వేల బడ్జెట్‌లో..

|

Jun 17, 2024 | 10:31 AM

ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్స్‌లో కెమెరాకు ప్రధాన్యత పెరుగుతోంది. కెమెరా క్లారిటీ ఉన్న ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. డిజిటల్ కెమెరాల స్థానాన్ని స్మార్ట్ ఫోన్‌లు ఆక్రమించిన తరుణంలో మిడ్ రేంజ్‌ బడ్జెట్‌లోనే మంచి కెమెరా ఫోన్‌లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. మరి ప్రస్తుతం మార్కెట్లో రూ. 30 వేల బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ స్మార్ట్‌ ఫోన్‌లు ఏంటి.? వాటి ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
 తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్‌ ఫోన్స్‌లో రియల్‌ మీ12 ప్రో+ స్మార్ట్ ఫోన్‌ ఒకటి. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా సెన్సార్, 64 మెగాపిక్సెల్ ఓవీ64బీ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

2 / 5
చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వివోకు సంబంధించి వివో వీ30ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్882 ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియోకాల్స్‌ కోసం ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. అలాగే ఇందులో కంటిన్యూస్ షూటింగ్, హై డైనమిక్ రేంజ్ మోడ్ సూపర్‌ మూన్‌ వంటి ఫీచర్లను అందించారు.

3 / 5
 రోడ్‌ మీ నోట్‌ 13 ప్రో+ స్మార్ట్ ఫోన్‌లో ఏకంగా 200 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను అందించారు. దీంతో పాటు సామ్‌సంగ్‌ ఐసోసెల్ హెచ్పి 3 సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, ఎ2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

4 / 5
మిడ్ రేంజ్‌ బడ్జెట్‌లో మంచి కెమెరాతో అందుబాటులో ఉన్న మరో ఫోన్‌ వన్‌ప్లస్ నార్డ్‌ సీఈ 4 ఒకటి. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ లైట్ 600 ప్రైమరీ కెమెరా విత్ ఓఐఎస్, 8 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 355 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

5 / 5
టెక్నో కంపెనీకి చెదిన టెక్నో కామోన్‌ 30 కూడా బెస్ట్‌ కెమెరా ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులో ఓఐఎస్ సపోర్ట్​తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ను అందించారు. అలాగే 50 ఎంపీతో కూడిన ఆటోఫోకస్‌ ఫ్రంట్ కెమెరాను అందించారు. దీంతో సెల్ఫీలు ఆకర్షణీయంగా, హై క్వాలిటీతో వస్తాయి.