ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం అసర్ మార్కెట్లోకి రెండు కొత్త ట్యాబ్లెట్స్‌ను తీసుకొచ్చింది. అసర్ ఐకానియా 8.7, అసర్ ఐకానియా 10.36 పేర్లతో రెండు కొత్త ట్యాబ్లెట్స్‌ను లాంచ్ చేసింది. వీటిలో డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, డ్యూయల్ సిమ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లను అందించారు.
అసర్ ఐకానియా 8.7 ట్యాబ్‌లో 8.7 ఇంచెస్‌తో కూడిన 1340 x 800 పిక్సెల్ రిజల్యూషన్ స్క్రీన్‌ను ఇచ్చారు. 400 నిట్స్ పీక్ బ్రైట్ నెట్ ఈ స్క్రీన్ సొంతం. ఇక ఈ ట్యాబ్ మీడియాటెక్ హీలియో పీ22టీ ప్రాసెసర్‌తో పనచేస్తుంది.
కెమెరా విషయానికొస్తే ఇందులో 8 మెగాపిక్సెల్స్ రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 10 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5100 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. ఒకసారి ఛార్జ్ చేస్తే 8 గంటలు పనిచేస్తుంది.
ఇక అసర్ ఐకానియా 10.36 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 10.36 ఇంచెస్‌తో కూడిన 2కే రిజల్యూషన్ పీపీఎస్ డిస్‌ప్లేను అందించారు. 480 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం. ఈ ట్యాబ్ మీడియాటెక్ హీలియో జీ99 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
కెమెరా విషయానికొస్తే ఇందులో 16 ఎంపీతో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే 8 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 7400 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. అసర్ ఐకానియా 8.7 ప్రారంభ ధర రూ. 11,990, 10.36 ధర రూ. 14,990గా నిర్ణయించారు.