పొరపాటున కూడా AI చాట్‌బాట్‌కి చెప్పకూడని 5 విషయాలు.. చెప్పారంటే, కష్టాలను కొనితెచ్చుకున్నట్లే..

|

Jul 04, 2023 | 5:41 PM

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ టెక్నాలజీ(AI) గురించి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. టెక్నాలజీ ఆధునికతకు ఇది ఓ వరమని కొందరు, రానున్న కాలంలో ఇది పెనుప్రమాదంగా మారుతుందని మరి కొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా క్రమక్రమంగా ఏఐ, చాట్‌బాట్‌ని ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే వాటితో కొంత జాగ్రత్తగా ఉండాలని రోబోటిక్ సైంటిస్టులే సూచిస్తున్నారు. ఈ క్రమలో కొన్ని విషయాలను వాటితో షేర్ చేయకూడదని, చేస్తే భవిష్యత్‌లో అవి మన ప్రైవసీకి ఆటంకంగా మారతాయని వారు వివరిస్తున్నారు. మరి ఏఐ, చాట్‌బాట్‌లకు చెప్పకూడని విషయాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
కొంతమంది వినియోగదారులు తమ ఆర్థిక సలహాలు, పర్సనల్ ఫైనాన్స్‌ని నిర్వహించేందుకు AI చాట్‌బాట్‌ల సహాయం తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల వారు ఎప్పుడైనా సైబర్ క్రిమినల్స్ చేతిలో బాధితులుగా మారవచ్చు. ఎందుకంటే సైటర్ క్రిమినల్స్ చాట్ GPT సహాయంతో ఎప్పుడైనా మీ అకౌంట్లను హ్యాక్ చేయవచ్చు. ఆ ప్రమాదం నుంచి తప్పుకోవాలంటే మన బ్యాంక్ డిటియిల్స్, ఈ మెయిల్స్ వంటివాటిని ఏఐ చాట్‌బాట్‌లకు తెలియకుండా ఉండడమే మంచిది.

2 / 5
మెంటల్ హెల్త్ ట్రిట్‌మెంట్ కోసం కూడా కొందరు ఏఐని ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో వారు తమ వ్యక్తిగత, సన్నిహితుల వివరాలను, ఆలోచనలను చాట్‌బాట్‌తో షేర్ చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల మీరు ఏదో ఒకరోజు దాని నుంచి ప్రైవసీ సంబధిత సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

3 / 5
చాట్‌బాట్‌తో బీ పాస్‌వర్డ్‌లను కూడా ఎప్పుడూ షేర్ చేయకండి. ఇలా చేస్తే చాట్‌బాట్‌లు మీ డేటాను పబ్లిక్ సర్వర్‌కు అప్‌లోడ్ చేసే ప్రమాదం ఉంది. హ్యాకర్లు కనుక పబ్లిక్ సెర్వర్‌పై కన్ను వేస్తే మీ ఖాతా నుంచి పర్సనల్ సమాచారం లీకవుతుంది. ఇంకా ఆపై మీరు ఎన్నో రకాలుగా మోసపోవచ్చు. ఇలాంటి ఘటన మే 2022లో జరిగింది. ఈ కారణంగానే యూరోపియన్ యూనియన్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ పేరుతో ఇటలీలో చాట్ GPT నిషేధించబడింది.

4 / 5
ఏదైనా పనికి సంబంధించిన రహస్యాలను కూడా చాట్‌బాట్‌తో షేర్ చేయకండి. యాపిల్, శామ్సంగ్, గూగుల్ వంటి పలు దిగ్గజ టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీస్ విషయంలో చాట్‌బాట్‌లను ఉపయోగించవద్దని ప్రత్యేకంగా హెచ్చరించాయి. అలాగే బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం ఓ శామ్సంగ్ ఉద్యోగి కోడింగ్ కోసం Chat GPTని ఉపయోగించడం వల్ల కంపెనీకి సంబంధించిన రహస్య సమాచారం లీకైంది. ఇదే విధంగా మీ విషయంలోనూ జరగవచ్చు.

5 / 5
మీ లోకేషన్, పర్సనల్ వివరాలను కూడా చాట్ GTPలో షేర్ చేయవచ్చు. ఇవి మీ భవిష్యత్తులో చిక్కు సమస్యలుగా మారే ప్రమాదం ఉంది.