2 / 5
వాట్సాప్ ఈ కొత్త ఆప్షన్ ద్వారా వినియోగదారులు ఒకే సమయంలో నాలుగు ఫోన్లలో ఒకే వాట్సాప్ ఖాతాను ఉపయోగించవచ్చు. అంటే మీరు నాలుగు ఫోన్లలో ఒక వాట్సాప్ ఖాతాను తెరిచి ఉంచుకోవచ్చు. నాలుగు కంటే ఎక్కువ డివైజ్‌లలో ఒక్క వాట్సాప్ ఖాతాను తెరిచి ఉంచడం సాధ్యం కాదు. మీరు వాట్సాప్ ఖాతాను వేరే ఫోన్‌లో ఉపయోగించాలనుకుంటే, మీరు దాన్ని కొత్తగా ఇన్‌స్టాల్ చేయాలి. ఆపై, ఖాతాను సెటప్ చేసేటప్పుడు, ఫోన్ నంబర్‌ను నమోదు చేయడానికి బదులుగా, 'ఎగ్జిస్టింగ్ అకౌంట్' ఎంపికను ఎంచుకోండి.