రుచికరమైన ఉల్లిపాయ పకోడి.. పల్లెటూరి స్టైల్‌లో ఎలా చేయాలంటే?

Updated on: Nov 25, 2026 | 4:04 PM

ఉల్లిపాయ పకోడి అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. మీకు కూడా చాలా ఇష్టమా? అయితే ఎప్పుడూ చేసుకోని విధంగా కాస్త రుచికరంగా ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే.. పల్లెటూరి స్టైల్లో ఇలా పకోడి చేస్తే రుచి అదిరిపోతుందంట.

1 / 5
ఉల్లిపాయ పకోడి చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడుతుంటారు. కాగా, ఇప్పుడు మనం దీనిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. ఉల్లిపాయలు: 3 మీడియం సైజు,  పచ్చిమిరపకాయలు: 4,   కరివేపాకు: కొద్దిగా,కొత్తిమీర: కొద్దిగా,   కారంపొడి: 1/2 టీస్పూన్,  గరం మసాలా: 1/2 టీస్పూన్,  ధనియాల పొడి: 1/2 టీస్పూన్, పసుపు: 1/4 టీస్పూన్,   సాల్ట్: 1/2 టీస్పూన్, సోంపు: 1/2 టీస్పూన్,అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్,   జీడిపప్పు: కొద్దిగా, శనగపిండి: 1 కప్పు,   పొడి బియ్యప్పిండి: 1/4 కప్పు,  నూనె డీప్ ఫ్రైకి సరిపడ.

2 / 5
తయారీ విధానంలోకి వెళ్లితే..ముందుగా, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మూడు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా, నిలువుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ రేకులను చేతితో బాగా నలుపుతూ విడివిడిగా వచ్చేలా చేసుకోవాలి. ఉల్లిపాయలు చిన్నవి, లేతవిగా ఉంటే నలుపుతున్నప్పుడు ఎక్కువ నీరు విడుదలవుతుంది. ఇది పకోడీకి రుచిని, తేమను అందిస్తుంది.ఇప్పుడు ఉల్లిపాయల్లో నిలువుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి. మీకు నచ్చితే పుదీనా ఆకులు కూడా కలుపుకోవచ్చు. తరువాత, అర టీస్పూన్ కారంపొడి, అర టీస్పూన్ గరం మసాలా, అర టీస్పూన్ ధనియాల పొడి, పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ సాల్ట్, అర టీస్పూన్ సోంపు, ఒక టీస్పూన్ తాజాగా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఆప్షనల్‌గా కొద్దిగా జీడిపప్పు కూడా చేర్చవచ్చు. ఈ మసాలాలు అన్నింటినీ ఉల్లిపాయలకు బాగా పట్టేలా చేతితో కలపాలి.

3 / 5
ఈ మిశ్రమంలో ఒక కప్పు జల్లించిన శనగపిండి, పావు కప్పు జల్లించిన పొడి బియ్యప్పిండి వేయాలి. ఇప్పుడు పిండిని కలపడానికి ఒక చుక్క కూడా నీళ్లు వేయకుండా, ఉల్లిపాయల్లోని నీటితోనే ప్రెస్ చేస్తూ బాగా కలపాలి. ఉల్లిపాయలను ఇలా నలుపుతూ కలిపితే వాటిలోని నీరు బయటికి వచ్చి పిండికి పడుతుంది. పిండి ముద్దలుగా, గట్టి కన్సిస్టెన్సీకి రావాలి. ఒకవేళ పిండి మరీ పొడిపొడిగా అనిపిస్తే, కొద్దిగా నీటిని చిలకరించి కలుపుకోవచ్చు. ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వేడి నూనెను పిండి మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఇది పకోడీకి అదనపు కరకరలాడే స్వభావాన్ని ఇస్తుంది. పకోడీ వేయించడానికి నూనె వేడి చేస్తూ ఉన్నప్పుడు, అందులో నుండి కొద్దిగా నూనెను తీసి ఇందులో కలపవచ్చు. పిండి మొత్తం కలిసిన తర్వాత, వీడియోలో చూపిన కన్సిస్టెన్సీకి రావాలి.

4 / 5
స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత, స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి, సిద్ధం పకోడీలు కొద్దిగా గట్టిపడిన తర్వాత మరోవైపు తిప్పుకుంటూ, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చి, కరకరలాడే వరకు వేయించుకోవాలి. వేయించినప్పుడు గరిటతో కదిలించినట్లయితే గలగలమనే శబ్దం రావాలి.

5 / 5
 చివరగా, కొద్దిగా కరివేపాకు కూడా నూనెలో వేసి, క్రిస్పీగా అయ్యే వరకు వేయించి పకోడీలతో పాటు కలపాలి. అదనపు నూనెను పీల్చుకోవడానికి పేపర్ నాప్‌కిన్ వేసిన బౌల్‌లోకి పకోడీలను తీసుకోవాలి. చేసుకున్న పకోడీ పిండిని చిన్న చిన్న ముక్కలుగా విడివిడిగా నూనెలో వేయాలి. నూనెలో మరీ ఎక్కువగా పకోడీలు వేయకూడదు, అవి ఫ్రీగా తిరిగేంత ఖాళీ ఉండాలి. ఎక్కువగా వేస్తే నూనెను ఎక్కువగా పీల్చుకుంటాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us