
PCOD అనేది హార్మోన్ల అసమతుల్యత వల్ల కలిగే సమస్య, దీనివల్ల క్రమం తప్పని పీరియడ్స్, బరువు పెరగడం, చర్మ సమస్యలు వస్తుంటాయి. అయితే, ఈ PCOD అనేది నయం చేయలేని వ్యాధి కాదు, కేవలం జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా దీనిని పూర్తిగా నియంత్రించవచ్చు. అందుకోసం మీ రోజువారి డైట్‌లో తప్పనిసరిగా కొన్ని ఆహారపదార్థాలను చేర్చుకోవటం కొన్ని అలవాట్లను పాటించటం చేస్తే సరిపోతుంది.

నల్ల ఎండుద్రాక్ష. ఎండుద్రాక్షలో ఇనుము, మెగ్నీషియం రెండూ మంచి పరిమాణంలో లభిస్తాయి. అందువల్ల, ఇది రక్త పరిమాణాన్ని పెంచడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా, ఎండుద్రాక్ష శరీరం నుండి అలసటను కూడా తగ్గిస్తుంది.

వాల్‌నట్స్. వాల్‌నట్స్‌లో ఒమేగా 3, మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇది హార్మోన్ల సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది. PCOD సమస్యకు ప్రధాన కారణం హార్మోన్ల అసమతుల్యతే. మనం దీనిని వాల్‌నట్స్‌తో నియంత్రించవచ్చు.

PCOD సమస్యలను తగ్గించే మరో ఆహారం అత్తి పండ్లు. అత్తి పండ్లలోని చిన్న గింజలలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరం నుండి అదనపు ఈస్ట్రోజెన్ లేదా ఇతర విషపదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు: రోజు వారి ఆహారంలో ముఖ్యంగా చక్కెరను తగ్గించండి. తీపి పదార్థాలు ఇన్సులిన్ స్థాయిలను పెంచి సమస్యను తీవ్రం చేస్తాయి. దీంతోపాటు శారీరక శ్రమ తప్పనిసరి. రోజుకు కనీసం 30 నిమిషాల నడక లేదా యోగా హార్మోన్ల పనితీరును మెరుగుపరుస్తుంది. వీటితో పాటు సరిపడా నీళ్లు తాగటం. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి.