Narang set to Marry: ఓ ఇంటివాడు కాబోతున్న స్టార్​ షూటర్​ గగన్ నారంగ్​.. 21న హైదరాబాద్‌లోని ఒక స్టార్‌ హోటల్లో వివాహం

|

Apr 06, 2021 | 11:18 PM

భారత స్టార్​ షూటర్​ గగన్ నారంగ్​ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సహచర షూటర్​ అన్నురాజ్​ను ఈ నెల 21న వివాహం చేసుకోనున్నాడు.

1 / 4
హైదరాబాద్‌ స్టార్‌ షూటర్‌, ఒలింపిక్‌ కాంస్య విజేత గగన్‌ నారంగ్‌ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. 2010 కామన్వెల్త్‌ క్రీడల్లో రెండు స్వర్ణాలు గెలిచిన ఉత్తర్‌ ప్రదేశ్‌ షూటర్‌ అన్నురాజ్‌ సింగ్‌తో.. గగన్‌ పెళ్లి ఈ నెల 21న హైదరాబాద్‌లోని ఒక స్టార్‌ హోటల్లో జరగబోతోంది.

2 / 4
 వీళ్లిద్దరి వయసూ 37 ఏళ్లే. రెండు దశాబ్దాలుగా షూటింగ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ అనేక అంతర్జాతీయ టోర్నీల్లో కలిసి పోటీ పడుతున్నారు.

3 / 4
తన తల్లికి అన్ను అంటే చాలా ఇష్టమని, అలాగే అన్ను తల్లిదండ్రులకు తాను నచ్చానని, దీంతో పెళ్లికి మార్గం సుగమమైందని గగన్‌ తెలిపాడు.

4 / 4
మేం పెళ్లి చేసుకుందామని సరిగ్గా ఎప్పుడు అనుకున్నామో చెప్పలేను. 2002 నుంచి జట్టు సభ్యులుగా ఉన్నాం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అన్ని సమయాల్లో ఒకరికొకరు అండగా నిలిచాం. తర్వాత స్నేహితులయ్యాం అంటూ షూటర్ గగన్ నారంగ్ వివరించాడు.