
లీడ్స్‌లోని హెడింగ్లీ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా సూపర్ బౌలింగ్‌తో అదరగొట్టాడు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాకు మంచి స్కోర్ లభించింది. యశస్వి జైస్వాల్ (101), శుభ్‌మాన్ గిల్ (147), రిషబ్ పంత్ (134) సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 471 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

ఇక తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్లోనే షాక్ ఇచ్చాడు. బుమ్రా మొదటి ఓవర్ చివరి బంతికి జాక్ క్రాలీ (4) వికెట్ ను పడగొట్టాడు. తరువాత బెన్ డకెట్ (64) ను క్లీన్ బౌల్డ్ చేశాడు. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి, అతను జో రూట్ (28) వికెట్ తీసుకొని టీమిండియాకు మూడో వికెట్‌ను కూడా అందించాడు.

ఈ మూడు వికెట్లతో జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ క్రికెట్‌లో ప్రత్యేక రికార్డును సృష్టించాడు. అది కూడా పాకిస్తాన్ లెజెండ్ వసీం అక్రమ్ గొప్ప రికార్డును బద్దలు కొట్టడం ద్వారా సాధ్యమైంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును అక్రమ్ కలిగి ఉన్నాడు. వీటిని సెనా(SENA) దేశాలు అని కూడా క్రికెట్ లవర్స్ అంటారు.

వసీం అక్రమ్ దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఆస్ట్రేలియా (SENA దేశాలు)లలో మొత్తం 55 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో మొత్తం 146 వికెట్లు పడగొట్టాడు. దీనితో అతను SENA దేశాలలో అత్యధిక వికెట్లు తీసిన ఆసియా బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా ఈ రికార్డును బద్దలు కొట్టడాడు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలలో 60 ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేసి బుమ్రా 148 వికెట్లు పడగొట్టాడు. దీనితో సెనా దేశాలలో అత్యధిక వికెట్లు తీసిన ఆసియా బౌలర్‌గా ఘనత సాధించాడు.