
ఐపీఎల్ 2021 సందడి మొదలైంది. ఇందు కోసం చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ క్యాంప్ కూడా మొదలు పెట్టింది. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత కూడా ఉంది. నెట్ ప్రాక్టీస్ కోసం మొదలు పెట్టిన ఈ క్యాంప్‌లో క్రికెట్‌ను పక్కన పెట్టి మరో ఆట మొదలు పెట్టారు.

సీఎస్‌కె బ్యాట్స్‌మన్ సురేష్ రైనా కళ్ళకు కట్టిన సీఎస్‌కే కెప్టెన్ ధోనీ ఓ పరీక్ష పెట్టాడు. అంతే కాదు ఎంఎస్ ధోనితో డ్వేన్ బ్రావో జతకట్టి ఆటపట్టించారు.

క్రికెట్‌తోపాటు వంటలు చేయడంలోనూ సురేష్ రైనా దిట్టా అంటూ ప్రశంసించాడు సీఎస్‌కే ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో.

రైనా తయారుచేసిన ఆహారం మాత్రం బ్రావో, ధోనీ ఇద్దరూ కలిసి లాగించారు. రుచికరమైన మంటకాలను మంచిగా ఆస్వాదించారు.