
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 18లో ముంబై ఇండియన్స్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓడిపోయింది. KKRతో జరిగిన మూడో మ్యాచ్‌లో గెలిచిన ముంబై.. లక్నో సూపర్ జెయింట్స్‌తో శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో ఓటమి పాలైంది.

ఓటమి తర్వాత మాట్లాడిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఓటమికి పూర్తి బాధ్యత తాను తీసుకుంటున్నానని చెప్పాడు. తిలక్ వర్మను రిటైర్డ్ అవుట్‌గా పంపించడాన్ని పాండ్యా సమర్థించాడు. మ్యాచ్ అనంతరం జరిగిన ఇంటర్వ్యూలో చిరునవ్వుతో కనిపించిన పాండ్యా, ఆ తర్వాత భావోద్వేగానికి గురయ్యాడు.

ఇంటర్వ్యూలో పాండ్యా తన భావోద్వేగాలను అణచుకుంటూ ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. కానీ, ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత మాత్రం తన బాధను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. దూరంగా నిలబడి, ముఖం కిందకి దించుకుని, కన్నీళ్లను అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించాడు. పాండ్యా భావోద్వేగానికి గురైన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గత సీజన్ నుంచి ఇప్పటివరకు 17 మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్‌కు నాయకత్వం వహించిన హార్దిక్ పాండ్యా కేవలం 5 మ్యాచ్‌ల్లోనే విజయాన్ని రుచి చూశాడు. మిగిలిన 12 మ్యాచ్‌ల్లోనూ ముంబై ఓడిపోయింది. ఈ పరాజయాల కారణంగా హార్దిక్ పాండ్యా నిరాశలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు.

ప్రస్తుతం 4 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ముంబై ఇండియన్స్, లీగ్ దశలో ఇంకా 10 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్ సొంత గ్రౌండ్ వాంఖడేలో జరుగనుంది. ఏప్రిల్ 7న జరిగే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఆ మ్యాచ్‌లోనూ ఓడితే.. ముంబై ప్లే ఆఫ్ ఆశలు మరింత క్లిష్టం అవుతాయి.