ఉగాది పచ్చడి ఎందుకు తప్పనిసరిగా తినాలి? ఎన్ని రోజులు తినొచ్చో తెలుసా!

Updated on: Mar 18, 2026 | 4:13 PM

Ugadi Pachadi: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది ప్రత్యేకమైన పండగ. ఈరోజు ఆనందోత్సాహాల మధ్య పండగను జరుపుకుంటారు. ఉగాదికి ప్రత్యేకం ఉగాది పచ్చడి. ఉగాది రోజున తినే ఉగాది పచ్చడి మన జీవితంలో ఎదుర్కొంటున్న కష్ట సుఖాలకు సంకేతాలుగా పండితులు చెబుతుంటారు. కష్టాన్ని, సుఖాన్ని కూడా సంతోషంగా స్వీకరించగలగాలని చెబుతోంది.

1 / 5
తెలుగు సంవత్సరాది ఉగాది అంటే తెలుగు రాష్ట్రాల్లో  ఒక ప్రత్యేక పండగ. ఉగాదితో ప్రకృ తిలోనూ చాలా మార్పులు చోటు చేసుకుంటాయి.  వసంత ఋతువు రాకతో ప్రకృతి పచ్చని పరుపు పరచుకుని మనసులను హరించేస్తుంది. మామిడి చిగుర్ల సోయగం, కోకిలల మధుర గానాలు, వేపపూత పరిమళాల మధ్య తెలుగువారి ఇళ్లలో కొత్త సంవత్సర సంబరాలు మొదలవుతాయి. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకునే ఉగాది పండుగతో తెలుగు నూతన సంవత్సరం ఘనంగా ఆరంభమవుతుంది. ఈ ఏడాది ఉగాది మార్చి 19న, రేవతి నక్షత్ర ప్రవేశంతో రానుంది.

2 / 5
కష్టసుఖాల మేళవింపుగా గడిచిన కాలాని(గత సంవత్సరం)కి వీడ్కోలు పలుకుతూ.. ఆశలతో నిండిన కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు ఇదొక శుభ సమయం. రైతులు కూడా కొత్త సాగు పనులకు శ్రీకారం చుట్టే పవిత్రమైన ప్రారంభం ఇదే.

3 / 5
ఉగాది అంటే మొదటగా గుర్తుకు వచ్చే షడ్రుచుల సమ్మేళనమైన పచ్చడి. ఉగాది పచ్చడి కేవలం ఒక సంప్రదాయం మాత్రమే  కాదు.. ఆరోగ్యానికి మేలుచేసే ఔషధం కూడా. ఈ పచ్చడిలోని         షడ్రుచులు మన జీవితంలోని విభిన్న అనుభవాలను సూచిస్తాయి. వేపపూత శరీరాన్ని శుద్ధి చేస్తుంది, మామిడి ముక్కలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ పచ్చడిని ఉగాది రోజు మాత్రమే కాకుండా శ్రీరామ నవమి లేదా చైత్ర పౌర్ణమి వరకు రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి మంచి శక్తి, రోగనిరోధకత లభిస్తుంది.

4 / 5
ఉగాది పచ్చడి స్వీకరించే సమయంలో ఈ శ్లోకాన్ని పఠించడం శుభప్రదంగా భావిస్తారు:

“శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్‌ప్రదాయినే    
సర్వారిష్టవినాశాయ నింబకదళభక్షణం”

అర్థం: వజ్రంలా దృఢమైన శరీరం, నూరేళ్ల ఆయుష్షు, సమస్త సంపదలు కలగాలని, అన్ని అపాయాలు, వ్యాధులు తొలగిపోవాలని కోరుకుంటూ ఈ వేపదళాన్ని (ఉగాది పచ్చడిని) భక్తితో స్వీకరిస్తున్నాను.

ఉగాది పచ్చడి స్వీకరించే సమయంలో ఈ శ్లోకాన్ని పఠించడం శుభప్రదంగా భావిస్తారు: “శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్‌ప్రదాయినే సర్వారిష్టవినాశాయ నింబకదళభక్షణం” అర్థం: వజ్రంలా దృఢమైన శరీరం, నూరేళ్ల ఆయుష్షు, సమస్త సంపదలు కలగాలని, అన్ని అపాయాలు, వ్యాధులు తొలగిపోవాలని కోరుకుంటూ ఈ వేపదళాన్ని (ఉగాది పచ్చడిని) భక్తితో స్వీకరిస్తున్నాను.

5 / 5
ఉగాది పచ్చడి తయారీ వెనుక అర్థం ఉంది. సంవత్సరం మొత్తం ఎదురయ్యే కష్టాలు, సుఖాలు సమానంగా స్వీకరించగల సిద్ధతను పొందడం. పచ్చడిని దేవుని వద్ద ఉంచి పూజించి, తరువాత కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో విందు చేసుకోవాలి. వసంత ఋతువులో వచ్చే వ్యాధుల నుంచి రక్షణ కోసం వేప పువ్వులు వాడి పచ్చడి చేయడం శాస్త్రీయ ఆచారం.

ఉగాది పచ్చడి ఆరు రుచుల కలయిక. ఇందులో షడ్రుచులు (ఆరు రుచి) ఉంటాయి: తీపి కోసం బెల్లం, వగరు కోసం కొత్త మామిడి, పులుపు కోసం చింతపండు, రుచి కోసం ఉప్పు, చేదు కోసం వేప పువ్వులు ఉపయోగిస్తారు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని విశ్వసించడం మీ వ్యక్తిగతం. దీనిని సంస్థ ధృవీకరించదు.)

ఉగాది పచ్చడి తయారీ వెనుక అర్థం ఉంది. సంవత్సరం మొత్తం ఎదురయ్యే కష్టాలు, సుఖాలు సమానంగా స్వీకరించగల సిద్ధతను పొందడం. పచ్చడిని దేవుని వద్ద ఉంచి పూజించి, తరువాత కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో విందు చేసుకోవాలి. వసంత ఋతువులో వచ్చే వ్యాధుల నుంచి రక్షణ కోసం వేప పువ్వులు వాడి పచ్చడి చేయడం శాస్త్రీయ ఆచారం. ఉగాది పచ్చడి ఆరు రుచుల కలయిక. ఇందులో షడ్రుచులు (ఆరు రుచి) ఉంటాయి: తీపి కోసం బెల్లం, వగరు కోసం కొత్త మామిడి, పులుపు కోసం చింతపండు, రుచి కోసం ఉప్పు, చేదు కోసం వేప పువ్వులు ఉపయోగిస్తారు. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని విశ్వసించడం మీ వ్యక్తిగతం. దీనిని సంస్థ ధృవీకరించదు.)

Follow Us