
తులసి మొక్కను రావి చెట్టును కూడా పవిత్రమైనదిగా చెబుతారు కానీ తులసి పక్కన నాటకూడదని చెబుతున్నారు. ఎందుకంటే, దీనిలోఉండే శక్తి ఇంట్లో కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి, ఈ మొక్కల పక్కన తులసిని అస్సలు ఉంచకూడదు. ఒక వేళ ఉంటే రోజూ ఉప్పు, పప్పుకు గొడవలు జరుగుతుంటాయి.

ముఖ్యంగా తులసి మొక్క పక్కన చింత చెట్టును ఉంచకూడదు. చింత చెట్టు చాలా బరువు ఉంటుంది. కాబట్టి, దీనిని అస్సలు ఉంచకూడదు. ఇది భార్య భర్తల మధ్య గొడవలు పెంచుతుంది, వారిని విడిపోయేలా చేస్తుంది. మీ ఇంట్లో ఉంటే వెంటనే దానిని కట్ చేయండి.

కొన్ని సార్లు తెలియకుండానే కొన్ని మొక్కలు ఉంచుతారు. అయితే, వీటిని పెట్టడం అంత మంచిది కాదు. ఇవి తులసి మొక్కకు ఉండే శక్తిని తగ్గించి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయి. వాస్తు ప్రకారం ఒక్కో మొక్కకు అనేక శక్తులు ఉంటాయి. అయితే, ఈ మొక్క పక్కన వేరేవి పెట్టడానికి వీల్లేదని చెబుతున్నారు.

తులసి దగ్గర దీపం వెలిగించడం.. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ముందుగా అగరబత్తి వెలిగించి, తర్వాత తులసి దగ్గర నూనె దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. దీపం తులసి వైపు ఉండాలి, కానీ దక్షిణ దిశ వైపు ఉండకూడదు. దీపం వెలిగించిన తర్వాత పువ్వులు సమర్పించవచ్చు.

తులసి మొక్క: తులసి మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఇది పూజలకే కాకుండా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టగలదు. ఇంకా ఈ మొక్కను ఇంట్లో పెంచితే పెళ్లి బాజాలు మోగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే, మీ వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి.