
భోగభాగ్యాలకు, సిరిసంపదలకు, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్ర గ్రహం ప్రస్తుతం తన స్వక్షే త్రమైన వృషభ రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఈ రాశిలో శుక్రుడికి బాగా బలం పెరగడంతో పాటు, స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఫలితాలనివ్వడం జరుగుతుంది. సిరిసంపదలను ఇవ్వడంలో సాధారణంగా శుక్రుడు తనకు ఇష్టమైన రాశులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. శుక్రుడికి బాగా ఇష్టమైన రాశులుః వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభం. వీటి అధిపతులైన శని, బుధులు శుక్రుడికి మిత్ర గ్రహాలు. శుక్రుడు ఈ నెల 14న వృషభ రాశి నుంచి మిథున రాశిలో ప్రవేశించే లోగా తప్పకుండా వీరికి అదృష్టాన్ని కలిగించడం జరుగుతుంది.

వృషభం: ఈ రాశికి అధిపతి అయినందువల్ల శుక్రుడు ఈ రాశివారికి తప్పకుండా అంచనాలకు మించి సిరి సంపదలను అనుగ్రహించే అవకాశముంది. ఈ రాశివారు భోగభాగ్యాలతో పాటు విలాస జీవితాన్ని అనుభవిస్తారు. కొద్ది ప్రయత్నంతో ఆదాయం అంచనాలను మించి పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ది చెందుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ప్రముఖులతో స్నేహాలు విస్తరిస్తాయి.

మిథునం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు వ్యయ స్థానంలో సంచారం ప్రారంభించడం వల్ల ఈ రాశి వారికి విదేశీ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశీ సంపాదన యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు తరచూ వెళ్లే అవకాశం కలుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి, ఒకటి రెండు ధన యోగాలకు అవకాశం ఉంది. భోగభాగ్యాలతో విలాస జీవితం అనుభవిస్తారు. దాంపత్య జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.

కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న శుక్రుడు ఈ రాశివారికి తప్పకుండా ఆదాయాన్ని పెంచడం జరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. జీవనశైలి మారిపోతుంది. విలాస జీవితం అలవడుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు, వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. విదేశీ సంపాదనను అనుభవించే యోగం కలుగుతుంది. అనారోగ్యం నుంచి కోలుకోవడం జరుగుతుంది. సంపన్న వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.

తుల: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు తనకు మరో స్వక్షేత్రమైన వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఈ రాశివారి మనసులోని కోరికలు చాలావరకు సాకారమవుతాయి. సొంత ఇంటి కలతో పాటు, విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల కూడా నెరవేరుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో అంచనాలకు మించి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మకరం: ఈ రాశివారికి పంచమ స్థానంలో ప్రవేశిస్తున్న శుక్రుడు తప్పకుండా ఉద్యోగంలో అందలాలు ఎక్కించడం, జీతభత్యాలు పెంచడం జరుగుతుంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం లభించడం లేదా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. తల్లితండ్రుల వైపు నుంచి సిరిసంపదలను పొందుతారు. కుటుంబంలో సుఖసంతోషాలు వృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొంటారు. షేర్లు, స్పెక్యులేషన్లు అపారంగా లాభిస్తాయి.

కుంభం: ఈ రాశికి చతుర్థ స్థానంలో భాగ్యాధిపతి శుక్రుడి ప్రవేశం వల్ల ఈ రాశివారికి ధన యోగాలతో పాటు రాజయోగాలు కూడా కలుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు ఎక్కువగా వెళ్లడం జరుగు తుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమై ఆస్తి లాభం కలుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది.