Shukra Gochar 2026: తులా రాశిలో శుక్రుడు.. 4 మాసాలు వీరికి సిరిసంపదలు, భోగభాగ్యాలు!

Edited By:

Updated on: Sep 04, 2026 | 3:53 PM

Venus Transit 2026: గురువు తర్వాత అంతటి శుభ గ్రహం శక్రుడు. జాతక చక్రంలో శుక్రుడు బలంగా ఉన్నా, గ్రహ సంచారంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నా అటువంటి జాతకులు సుఖ సంతోషాల్లో, సిరిసంపదల్లో, భోగ భాగ్యాల్లో ఓలలాడడం ఖాయం. సెప్టెంబర్ 3వ తేదీన శుక్రుడు తనకు నీచ స్థానమైన కన్యారాశి నుంచి తన స్వక్షేత్రమైన తులా రాశిలోకి మారాడు. శుక్రుడు ఇక్కడ జనవరి 2వ తేదీ వరకు కొనసాగుతాడు. మధ్యలో వక్రగతి కారణంగా నవంబర్ 6 నుంచి నవంబర్ 21 వరకు కన్యారాశి సంచారం చేయడం జరుగుతుంది. శుక్రుడు సహజ శుభ గ్రహం అయినందువల్ల దాదాపు అన్ని రాశులకూ ఏదో రూపంలో శుభ ఫలితాలనివ్వడం జరుగుతుంది.

1 / 12
మేషం: ఈ రాశికి సప్తమ కేంద్రమైన తులా రాశిలో శుక్రుడు ప్రవేశించడంతో ఈ రాశివారికి మాలవ్య మహా పురుష యోగ ఫలితాలు అనుభవానికి వస్తాయి. రాజకీయాలు, తదితర ప్రజారంగాల్లో ఉన్నవారికి జీవితం వైభవంగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు, వైవాహిక జీవితం సుఖ సంతో షాలతో సాగుతుంది. విలాస జీవితం గడుపుతారు. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తేలికగా నెరవేరుతుంది. బాగా డబ్బు కలిసి వస్తుంది. జీవిత భాగస్వామికి కూడా అదృష్టం పడుతుంది.

2 / 12
వృషభం: ఈ రాశికి షష్ట స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు ప్రవేశంతో తప్పకుండా వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్నవారికి, ఉద్యోగం మారాలను కుంటున్నవారికి ఇది చాలా అనుకూల సమయం. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి బాగా కలిసి వస్తుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పెండింగు పనులన్నీ పూర్తవుతాయి.

3 / 12
మిథునం: ఈ రాశివారికి పంచమ స్థానంలో శుక్ర గ్రహ ప్రవేశంతో రాజపూజ్యాలు కలుగుతాయి. సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచనలు సక్సెస్ అవుతాయి. షేర్లు బాగా లాభి స్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వినడం, పిల్లలు విశేషంగా వృద్ధిలోకి రావడం వంటివి జరుగుతుంది. భక్తి భావాలు బాగా పెరుగుతాయి.

4 / 12
కర్కాటకం: ఈ రాశివారికి చతుర్థ కేంద్రంలోకి శుక్రుడు రావడం వల్ల మాలవ్య మహా పురుష యోగం ఏర్ప డింది. ఈ యోగం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగు తాయి. ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందుతారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారమై, సుఖ సంతో షాలు వెల్లివిరుస్తాయి. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. తల్లి నుంచి ఆస్తిపాస్తులు లభిస్తాయి.

5 / 12
సింహం: ఈ రాశికి తృతీయ స్థానంలో శుక్రుడు ప్రవేశంతో ఈ రాశివారికి ఎటువంటి ప్రయత్నమైనా కలిసి వస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల వల్ల ఆశించినంతగా ప్రయోజనం ఉంటుంది. సోదర వర్గంతో సమస్యలు పరిష్కారం అయి, సఖ్యత పెరుగుతుంది. చదువుల్లో ఉన్న వారు బాగా వృద్ధిలోకి వస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగంలో చేరడం జరుగుతుంది.

6 / 12
కన్య: ఈ రాశికి ధన స్థానంలో ధనాధిపతి శుక్రుడు ప్రవేశంతో ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆర్థికంగా ఊహించని పురోగతి ఉంటుంది. ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరు గుతుంది. కుటుంబ వ్యవహారాలన్నీ చక్కబడతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. విదేశీయాన సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా విదేశీ సంబంధం కుదురుతుంది.

7 / 12
తుల: ఈ రాశిలోకి రాశ్యధిపతి శుక్రుడి ప్రవేశం వల్ల ఈ రాశివారికి మాలవ్య మహా పురుష యోగం ఏర్పడుతోంది. దీని వల్ల ఏ రంగానికి చెందినవారైనప్పటికీ ప్రాభవం బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. సమాజంలో ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి, మంచి అదృష్టం పట్టడానికి అవకాశం ఉంది. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

8 / 12
వృశ్చికం: ఈ రాశికి శుక్రుడు వ్యయ స్థానంలోకి ప్రవేశంతో విలాస జీవితం మీద ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. దర్జాగా, గౌరవప్రదంగా జీవితం గడిపే అవకాశం ఉంది. శత్రు పీడ, రుణ బాధ చాలావరకు తగ్గుతాయి. దీర్ఘకాలిక అనా రోగ్యాలతో అవస్థలు పడుతున్నవారికి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు స్థాన చలనం ఉండవచ్చు. పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది.

9 / 12
ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో శుక్రుడు ప్రవేశం నుంచి ఈ రాశివారికి ఊహించని పురోగతి ఉంటుంది. ఏ రంగానికి చెందినవారైనప్పటికీ ఆశించిన దానికంటే ఎక్కువగా అభివృద్ధి ఉంటుంది. సంపద పెరుగుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరిగే అవకాశం ఉంది. కొత్తగా ఆస్తి కొనడం జరుగు తుంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ తాయి. అనారోగ్యాల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామికి కూడా  అదృష్టం పడుతుంది.

10 / 12
మకరం: దశమ కేంద్రంలోకి శుక్రుడు ప్రవేశం కారణంగా ఈ రాశివారికి మాలవ్య మహా పురుష యోగ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రాబల్యం, ప్రాభవం బాగా పెరుగు తాయి. మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే ఉన్నత స్థాయి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి. ఆశించిన గుర్తింపు లభిస్తుంది.

11 / 12
కుంభం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో శుక్ర గ్రహ ప్రవేశం వల్ల అనేక విధాలుగా అదృష్టం పడుతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం మొదలుపెట్టినా, ఏ పని చేపట్టినా విజయవంతమవుతుంది. విదేశీయా నానికి అవకాశం ఉంది. వీసా సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పిత్రార్జితం లభిస్తుంది. తండ్రితో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

12 / 12
మీనం: ఈ రాశికి అష్టమ స్థానంలో శుక్రుడి స్వస్థాన సంచారం వల్ల తప్పకుండా ఆర్థికంగా కలసి వస్తుంది. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. దాయాదుల ఆస్తి గానీ, వారసత్వపు ఆస్తి గానీ కలిసి వస్తుంది. బీమా డబ్బు చేతికి వస్తుంది. పింఛను పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. అనేక విధాలుగా ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోవడం జరుగుతుంది. తీర్థయాత్రలు, విహార యాత్రలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us